Dil Raju: సీఎంతో మీటింగ్ పై అలాంటి వాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్.. నిర్మాత దిల్ రాజు రియాక్షన్ ఇదే!

Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకున్నారు. అలాగే టాలీవుడ్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ముందు ఉండి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం గురించి మాట్లాడడం కోసం దిల్ రాజు అధ్యక్షత వహించిన విషయం తెలిసిందే. దిల్ రాజు పాటు ఇంకా చాలామంది సెలబ్రిటీలు ప్రముఖులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత ఈ మీటింగ్ జరగడంతో ఈ మీటింగ్ టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది.

అయితే ఈ మీటింగ్ అనంతరం టాలీవుడ్ ని, హైదరాబాద్ లో సినీ పరిశ్రమను ఎలా అభివృద్ధి చేయాలో మాత్రమే మాట్లాడుకున్నాం అని దిల్ రాజు చెప్పారు. అలాగే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ మరోసారి క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఈ మీటింగ్ పై కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేసారు. తాజాగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ హోదాలో దిల్ రాజు ట్విట్టర్ లో కేటీఆర్ కామెంట్స్ పై స్పందించారు. FDC చైర్మన్ ట్వీట్ లో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. సీఎం గారితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెల్సిందే.

 

తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహ పూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్ర అభివృద్ధికి, సామజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం గారు ఆకాంక్షించారు. హైదరాబాదును గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలనే సీఎం గారి బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది. కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరుతున్నాము. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ లేఖ వైరల్ గా మారింది.