తెలంగాణ టుడే.. వైర‌స్ గ్రామీణ ప్రాంతాల్లో విస్త‌రిస్తోందా..?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తికి బ్రేక్ ప‌డ‌డం లేదు. కొన్ని రాష్ట్రాల‌తో పోలిస్తే, మ‌రీ పెద్ద ఎత్తున కాక‌పోయినా, తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తం 1,430 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, క‌రోనా కార‌ణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 47,705కు చేరుకుంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా హైద‌ర‌బాద్‌లోనే 703 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మ‌రోవైపు కొద్ది రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తుంది. దీంతో తెలంగాణ ప్ర‌జ‌లు ఆందోళణ వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌పోతే తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా కార‌ణంగా 429 మంది మ‌ర‌ణించ‌గా, కరోనా బారిన ప‌డి 36,385 మంది కోలుకున్నారు. దీంతో ప్ర‌స్త‌తం తెలంగాణ‌లో 10,891 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.