Revanth Reddy: ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ జాబితాలో భాగంగా పలువురు పద్మ అవార్డులకు ఎంపిక అయ్యారు అయితే ఈ పద్మ అవార్డులను ప్రకటించిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పూర్తిస్థాయిలో అవమానించింది అంటూ ఈయన మండిపడ్డారు.
దాదాపు 139 మందికి పద్మ అవార్డులను పురస్కరించారు అందులో కనీసం ఒక ఐదు మంది కూడా తెలంగాణ వాళ్లు లేకపోవడం నిజంగా తెలంగాణ ప్రజలకు ఇది అవమానం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు.. తెలంగాణ నుంచి కేవలం ఇద్దరుకు మాత్రమే పద్మ అవార్డులు వరించాయి వారిలో ఒకరు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ ప్రకటించారు. మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డ్ ప్రకటించారు. ఈ విషయంపై తాను నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని ఈయన తెలిపారు.
తెలంగాణలో ఉన్న గొప్ప వ్యక్తుల జాబితాను పద్మ అవార్డుల కోసం సిఫార్సు చేస్తే కేంద్రం ఆ జాబితాను పట్టించుకోలేదన్నారు. తాను గద్దర్ పేరును పద్మ విభూషణ్ పురస్కారానికి సిఫార్సు చేశాను. ప్రముఖ విద్యావేత్త, ఐఐటి గురుగా పేరున్న చుక్క రామయ్య పేరును పద్మ భూషణ్ పేరును సిఫార్సు చేశామన్నారు. కవి గాయకుడు, జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ పేరును పద్మభూషణ్ పురస్కరానికి పంపించినట్లు చెప్పారు.
ప్రజా గాయకులు గోరటి వెంకన్న పేరును పద్మశ్రీ పురస్కారం కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. కవి, చరిత్రకారులు జయధీర్ తిరుమల రావు పేరును పద్మశ్రీ పురస్కారానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు. తెలంగాణ నుంచి నేను పంపించిన ఈ పేర్లను కేంద్రం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. వీరందరూ కూడా తెలంగాణ సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన వారేనని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇలా పద్మ అవార్డుల కోసం నేను పంపిన జాబితాని పట్టించుకోకుండా కేవలం ఇద్దరకు మాత్రమే పద్మ పురస్కారాలు పంపించడం అంటే నిజంగానే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇది అవమానం అంటూ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.