తమిళిసై, కేసీఆర్ ఫోటోపై సెటైర్ వేసిన తీన్మార్ మల్లన్న..

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై ను భేటీ అయినా సంగతి తెలిసిందే. అంతే కాకుండా ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ తో తమిళిసై రాజ్ భవన్లో ప్రమాణం స్వీకారం చేయించగా.. కేసీఆర్ కూడా హాజరైయ్యారు. ఈ సందర్భంగా అక్కడ వారు ముగ్గురు భేటీ అయిన ఫోటో వైరల్ గా మారటం తో ఆ ఫోటోకు తీన్మార్ మల్లన్న సెటైర్ వేశారు.

తమిళిసై, కేసీఆర్ ల మధ్య గ్యాప్ ఉందని తెలుసు కానీ.. మరి ఇంత అని తెలియదంటూ కామెంట్ చేశారు. సీఎం, చీఫ్ జస్టిస్ ఒకరే, కానీ గవర్నర్ వెనుక సెక్యూరిటీ గార్డ్. అది రాజ్యాంగ పదవి గౌరవం. అందరం గౌరవించాలి ఏది ఏమైనా అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరింత దూరం పెడతారు సార్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.