Puspha Movie: బీడీ నోట్లో పెట్టుకొని అచ్చం పుష్ప రాజ్ ను దించేసిన టీమిండియా క్రికెటర్!

Puspha Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీ విడుదలయ్యి విశేషమైన ఆదరణ దక్కించుకుందనే విషయం మనకు తెలిసిందే. అన్ని భాషలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ లో పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇందులో బన్నీ డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కరిని మెస్మరైజింగ్ చేసింది.

ఈ క్రమంలోనే కొందరు బన్నీ డైలాగులను రీ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోని టీమ్ ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా పుష్పరాజ్ అవతారమెత్తారు. పుష్ప సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ గడ్డం, జులపాల జుట్టుతో మాస్ లుక్ లో కనిపించారు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా కూడా అచ్చం ఇదే స్టైల్ అనుసరించారు. అచ్చం బన్నీ మాదిరిగానే మాసిన గడ్డం , జులపాల జుట్టుతో బీడీ నోట్లో పెట్టుకొని మాస్ లుక్ లో సందడి చేశాడు.

 

ఈ క్రమంలోనే ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రవీంద్ర జడేజా ఈ ఫోటోని షేర్ చేస్తూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైరూ’ అనే డైలాగ్‌ను క్యాప్షన్‌గా ఇచ్చాడు. ఇందులో జడేజా నోట్లో పెట్టుకున్న బీడీ పూర్తిగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని జడేజా వివరణ ఇచ్చారు.అదేవిధంగా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని క్యాన్సర్ కి కారణం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం జడేజా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.