AP: తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఓడిపోదు… ఓడిపోయిందంటే అదే కారణం: చంద్రబాబు

AP: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఎంతో మంచి క్రేజ్ ఉంది ఈ పార్టీని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నడుపుతూ ఉన్నప్పటికీ ఈ పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన సంగతి తెలిసిందే ఈ పార్టీని పెట్టిన ఎనిమిది నెలలకే రామారావు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా శ్రేయస్సు కోసం ఎంతో పాటుపడ్డారు రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి ఎన్నో సరికొత్త పథకాలను అమలు చేశారు.

ఇక రామారావు గారి తర్వాత ఈ పార్టీ పగ్గాలు నందమూరి వారసుల చేతికి కాకుండా నారా చంద్రబాబు నాయుడు చేతికి వెళ్లాయి. ఇక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని రామానాయుడుపల్లెలో శనివారం పర్యటించిన చంద్రబాబు స్వయంగా పింఛన్లను పంపిణీ చేయడమే కాకుండా ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తెలుగుదేశం పార్టీ గురించి అలాగే తెలుగుదేశం పార్టీ విజయాలను గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా పార్టీ గురించి మాట్లాడిన చంద్రబాబు..టీడీపీని ఓడించడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదని తెలిపారు. టీడీపిని ఓడించడం ఏ పార్టీకి సాధ్యం కాదన్నారు. ఒకవేళ టీడీపీ ఓడిపోయింది అంటే అందుకు ఒకే ఒక కారణం ఉందని తెలిపారు. టిడిపికి ఓటు వేయడం ఇష్టం లేనటువంటి కార్యకర్తలు మరే పార్టీకి ఓటు వేయకుండా ఇంట్లో పడుకుంటే తప్ప తెలుగుదేశం పార్టీ ఓడిపోదని చంద్రబాబు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ఎరుపు రక్తం కాదని పచ్చ రక్తం ఉందని వారు తెలుగుదేశం పార్టీకి తప్ప మరే పార్టీకి కూడా ఓట్లు వేయరని చంద్రబాబు తెలిపారు. ఇలా కార్యకర్తలు ఓటు వేయకపోతే తప్ప పార్టీ ఓడిపోతుందేమో కానీ తెలుగుదేశం పార్టీని ఓడించే సత్తా ఎవరికీ లేదు అంటూ స్వయంగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.