టీడీపీని కాపాడటానికి ఆ కుటుంబ నేతలు ఎందుకు బయటకు రావడం లేదు??

cbn

తెలుగు రాజకీయాల్లో టీడీపీ ఉన్నంత ఘనత ఏ పార్టీకి లేదు. కానీ 2019 ఎన్నికల తరువాత మాత్రం టీడీపీ దాదాపు పతనావస్థకు చేరుకుంది. ఇప్పటికే పార్టీలోకి చాలామంది కీలక నేతలు పార్టీని కూడా వీడారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలామందికి రాజకీయ భవిష్యత్ ఇచ్చారు. అయితే అలాంటి నేతలు కూడా ఇప్పుడు టీడీపీని పట్టించుకోవడం లేదు. పార్టీ పతనం అవుతున్నా కూడా పార్టీని పట్టించుకోవడం లేదు. చంద్రబాబు రాజకీయ బిక్షా పెట్టిన చాలా కుటుంబాలు ఇప్పుడు టీడీపీని దూరం పెడుతున్నాయి.

ycp planning to defeat chandrababu in kuppam
ycp planning to defeat chandrababu in kuppam

ఎవరా కుటుంబాలు!!

చంద్రబాబు నాయుడు ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చ‌క్రం తిప్పేలా చేశారు. వారిలో య‌న‌మ‌ల‌, మాగంటి, కేఈ, బొజ్జల‌, ప‌రిటాల‌, గాలి, చిక్కాల‌, ప‌య్యావుల, కింజ‌రాపు, కోడెల‌, గ‌ద్దె ఇలా చాలా కుటుంబాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కుటుంబాల్లో ఎన్ని పార్టీకి ప్రయోజ‌నంగా వ్యవ‌హ‌రిస్తున్నా యి? ఎంత మంది పార్టీ కోసం బ‌య‌ట‌కు వ‌స్తున్నారు? అంటే.. ప్రశ్నార్థకంగానే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఎప్పుడూ లేనంత దుర్బర స్థితిలో పార్టీ ఉంది. అయినా కూడా ఈ నాయకులు బయటకు రావడం లేదు.

బాబు కూడా వదిలేశారు

చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళను పార్టీకోసం పనిచెయ్యమని అడగకపోవడం ఆశ్చర్యం. ఎన్నిక‌ల త‌ర్వాత ఒక‌టి రెండు కుటుంబాలు మాత్రమే లైవ్‌లో క‌నిపిస్తున్నాయి. మిగిలిన కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ప‌రిణామాల‌తో పార్టీలో ఒక విధ‌మైన నైరాశ్యం ఏర్పడింది. ఇక‌, చంద్రబాబు కూడా వీరిపై ఎలాంటి ఒత్తిడీ తేక‌పోవడం గ‌మ‌నార్హం ఎవ‌రినీ బ‌య‌ట‌కు రావాల‌ని.. ఆయ‌న కోర‌డం లేదు. పైకి మాత్రం పార్టీని అభివృద్ధి చేయ‌డంలో క‌లిసి రావాల‌ని కోరుతున్నారు.కానీ, వినేవారు వింటున్నారు. మిగిలిన‌వారు క‌నీసం.. చంద్రబాబు మాట‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు.