టీడీపీ మళ్ళీ ఇరకాటంలో పడిందా! చంద్రబాబు చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడా!!

cbn telugurajyam

2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ టీడీపీ పరిస్థితి ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే పార్టీ భూస్థాపితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడానికి, పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపడానికి చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ప్రెసిడెంట్ గా కూడా అచ్చెన్నాయుడుని నియమించారు అలాగే పార్లమెంట్ జిల్లాలకు ఇంచార్జ్ లను నియమించారు. అయితే ఈ నియామకం విషయంలో గతంలో చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Nara Chandra Babu Naidu

బాబు చేసిన తప్పు ఏంటి??

చంద్రబాబు నాయుడు చేసిన, చేస్తున్న తప్పు ఏంటంటే కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో పార్టీలో ఉన్న అందరిని సంప్రదించకుండా కేవలం కొంతమంది నేతలనే సంప్రదించి నిర్ణయం తీసుకోవడం. గతంలో వైసీపీ నుండి టీడీపీలోకి వస్తున్న 23 ఎమ్మెల్యేల విషయంలో కూడా పార్టీలో చాలామంది సీనియర్ నేతలను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఒక్కొక్క పార్లమెంటు జిల్లాకీ ఒక ఇంచార్జ్‌ని నియ‌మించారు. ఈ నియామ‌కాల్లోనూ చంద్రబాబు ఎవ‌రినీ సంప్రదించ‌కుండానే ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. దీంతో త‌మ్ముళ్లు ఎక్కడిక‌క్కడ గుర్రుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా పార్లమెంట్ మహిళా ఇంచార్జ్ లా విషయంలో అయితే కనీసం జిల్లా అధ్యక్షులను కూడా చంద్రబాబు సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.

బాబు ఇక ఎప్పటికీ నేర్చుకోరా!!

చేసిన తప్పులు నుండి అనేక విషయాలు నేర్చుకున్నామని, ఇకపైన గతంలో చేసినటువంటి తప్పులు చెయ్యమని టీడీపీ అధినేత ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. అయితే అవి కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నాయి. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని బలపరచడానికో, బలహీనపరచడానికో అర్ధం. కావడం లేదని టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని పడితే వాళ్లను పార్టీలోకి తీసుకోవడం, ఎవరికి పడితే వాళ్లకు పదవులు ఇవ్వడం వల్లే టీడీపీ 2019 ఎన్నికల్లో అంతటి ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయినా కూడా చంద్రబాబు అవే తప్పులు చేస్తున్నారు.