HomeAndhra Pradeshఇదేనా మీ రైతు రాజ్యం.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు?

ఇదేనా మీ రైతు రాజ్యం.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు?

ఏపీ సీఎం వైఎస్ జగన్ చాలాసార్లు మీడియా ముందు కానీ.. ఏదైనా ప్రసంగాల్లో కానీ.. రైతుల గురించి చెప్తుంటారు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం. రైతురాజ్యం ఇది.. అంటూ చెబుతుంటారు. రైతు రాజ్యం అని చెప్పడమేనా? మరి.. ఎక్కడుంది రైతు రాజ్యం అంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.

Tdp President Chandrababu Fires On Ap Govt
tdp president chandrababu fires on ap govt

రైతు రాజ్యం అంటారు… ఇంకేదో అంటారు.. కానీ.. క్షేత్రస్థాయిలో అసలు రైతులనే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు కనీసం మద్దతు ధర కూడా కల్పించలేకపోతోంది ఈ ప్రభుత్వం.. రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయింది అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే.. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించామంటూ ఉత్తమాటలను చెబుతోంది ఈ వైసీపీ ప్రభుత్వం.. అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా రైతులు రోడ్ల మీదికి వచ్చి మద్దతు ధర కోసం నిరసన వ్యక్తం చేసిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ముందుగానే పంటలకు మద్దతు ధర ప్రకటించి వ్యవసాయాన్ని పండుగలా మార్చేశామని గాలి మాటలు చెబుతోంది ప్రభుత్వం. మరి అదే నిజమైతే మొన్న నెల్లూరు జిల్లాలో వరి రైతు, నేడు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో టమాటా రైతులు ఎందుకు రోడ్డెక్కాల్సి వచ్చింది. పండుగ చేసుకోవడానికా? ఇదేనా రైతుకు మీరు ఇస్తున్న మద్దతు? అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News