నెల్లూరులో టీడీపీ రాజకీయం ముగిసిందా!!బాబుకు కష్టాలు తప్పవు

cbn telugurajyam

2019 ఎన్నికల తరువాత ఏపీలో టీడీపీ యొక్క రాజకీయ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎంతలా అంటే పతనావస్థకు చేరువలో ఉంది. ఇప్పటికే పార్టీని మళ్ళీ ఎలా గాడిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు చాలా ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు నెల్లూరు రూపంలో మరో కష్టం వచ్చింది. ఇక్కడ ఉన్న నాయకుల మధ్య ఉన్న అంతర్గత ఘర్షణల వల్ల పార్టీ పతనం అయ్యేలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

cbn
cbn

నెల్లూరులో టీడీపీ కష్టాలు

నెల్లూరులో ఉన్న టీడీపీ నేతల మధ్య ఆధిప‌త్య పోరు కొన్నాళ్లుగా సాగుతోంది. టీడీపీ నాయకులే ఒకరిపై ఒకరిపై ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ప్రజ‌ల్లో గెల‌వ‌డం చేత‌కాని వాళ్లు కూడా మాపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ.. ఓ మాజీ మంత్రిని ఉద్దేశించి ఘాటుగా చేసిన వ్యాఖ్యలు.. అధినేత చంద్రబాబు వ‌ర‌క కూడా చేరాయి. దీంతో నెల్లూరులో టీడీపీ బ‌తికి బ‌ట్టక‌డుతుందా? అనేది సందేహంగా ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఆ త‌ర్వాత కూడా బీద మ‌స్తాన్‌రావు లాంటి నేత‌లు వైసీపీలోకి వెళ్లిపోయారు. అలాగే టీడీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొందరు వైసీపీలోకి వెళ్తే మరికొందరు టీడీపీలోనే ఉంటూ వైసీపీ కోసం పని చేస్తున్నారు. ఇలా టీడీపీలో పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది.

బాబు కూడా నెల్లూరు సమస్యను తీర్చలేడా!!

టీడీపీకి మళ్ళీ గత వైభవం తీసుకొని రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇప్పుడు నెల్లూరులో ఉన్న సమస్య బాబుకు తల నొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ అసలే పార్టీకి సరైన నాయకులు లేరని భావిస్తున్న ఈ గొడవలు ఇప్పుడు పార్టీని మరింత నాశనం చేస్తున్నాయి. నెల్లూరులో ఉన్న నాయకుల మధ్య ఉన్న అంతర్గత సమస్యలను బాబు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.