వైసీపీలో చీలికలు తెస్తున్న టీడీపీ ఎమ్మెల్యే, ఈ విషయంపై జగన్ మౌనం వీడనున్నాడా!!

ఆ ఘనకార్యం వైసీపీ, టీడీపీలేనా.. మేము చేస్తామంటున్న బీజేపీ 

2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఘన విజయానికి టీడీపీ నేతలకు ఇంకా నిద్రపట్టడం లేదు. అధికారంలో ఉన్న వైసీపీ నేతలు టీడీపీ నేతలనుఁ ఇంకా నేలమట్టం చెయ్యడానికి పథకాలు రచిస్తున్నారు. అలాగే వైసీపీ నేతలు చేస్తున్న కక్ష్యపూరిత రాజకీయాలకు భయపడి ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు వైసీపీ బాటపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వల్లభనేని వంశీ వంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కూడా జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు కానీ ఆయన వల్ల వైసీపీలో చీలికలు వస్తున్నాయి. ఆయన ఎవరంటే వాసుపల్లి గణేష్.
VasupalliGaneshKumar

వైసీపీలో చీలికలు తెచ్చిన గణేష్

విశాఖ సౌత్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గణేష్ ఇప్పుడు వైసీపీలోకి రావడాన్ని స్థానిక వైసీపీ నేతలు అంగీకరించడం లేదు. ఆయన గోడమీద పిల్లని, కేవలం రాజకీయ లబ్ది కోసమే వైసీపీలోకి వచ్చారని స్థానిక వైసీపీ ఇంచార్జ్ అయిన కోలా గురువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాసుపల్లి వైసీపీలోకి వెళ్లడం వల్ల అక్కడ వైసీపీలో చీలికలు వస్తున్నాయి. దీనికి నిదర్శనం జగన్ పాద యాత్ర మూడేళ్లయిన సందర్భంగా జగిరిన కార్యక్రమాల్లో ఈ చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖ సౌత్ లో ఈ కార్యక్రమాలు రెండు వర్గాలుగానే సాగుతున్నాయి. సీనియర్ నేత, మాజీ ఎమెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ మరణించారు కానీ లేకపోతే సౌత్ లో మరో వర్గం కూడా ఉండేది. ఇక ద్రోణంరాజు రాజకీయ వారసుడిగా ఉన్న కుమారుడు శ్రీ వాత్సవ తన మద్దతు కోలా గురువులుకే ప్రకటించారు. కోలా గురువులుకు మత్స్యకార సంఘం చైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు. దీంతో ఆ పదవితో ఆయన మళ్ళీ హవా చాటుకుంటున్నారు. ఇంకో వైపు విడిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాదయాత్ర చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎవరూ ఆయనతో కనిపించడంలేదు.

ఈ గోడవలపై జగన్ మౌనం విడుతారా!!

cm jagan mohan reddy
cm jagan mohan reddy

విశాఖ సౌత్ లో ఇప్పుడు వైసీపీ పెత్తనం కోసం గొడవలు జరుగుతున్నాయి, ఈ గొడవల వల్ల చివరికి నష్టపోయేది మాత్రం వైసీపీ పార్టీనే కాబట్టి ఈ గోడవలపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే తననే వైసీపీ ఇంచార్జ్ కూడా ప్రకటించాలని వాసుపల్లి గణేష్ జగన్ కు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. అలాగే పది సంవత్సరాల నుండి పార్టీ కోసం పని చేస్తున్న తమకు కాదని గణేష్ కు ఎలా ఇస్తారని కోలా గురువులు అంటున్నారు. ఈ ఆధిపత్య యుద్ధాలను జగన్ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.