TDP Mark Politics : టీడీపీ మార్కు రాజకీయం: తనకు తానే వెన్నుపోటు పొడుచుకున్న వైనం

TDP Mark Politics

TDP Mark Politics : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ, రాష్ట్ర గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తే చేయొచ్చుగాక.. అది ప్రతిపక్షం ఓ హక్కుగా భావించి వుండొచ్చుగాక. కానీ, సభలో గలాటా సృష్టించడమేంటి.? నిరసన తెలపడానికీ ఓ హద్దు వుంటుంది.

రాష్ట్ర గవర్నర్ అంటే.. రాజ్యాంగబద్ధమైన.. గౌరవప్రదమైన పదవి అది. ఆ పదవిలో వున్న వ్యక్తిని గౌరవించినా, గౌరవించకున్నా.. పదవికి అయితే గౌరవం ఇవ్వాలి కదా.?

అధికార పార్టీ ఏం రాసిస్తే, అదే గవర్నర్ చదువుతారు. అయితే, పార్టీ పరంగా కాదు.. ప్రభుత్వ పరంగా స్క్రిప్ట్ రెడీ అవుతుంది. చంద్రబాబు హయాంలోనూ జరిగింది అదే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా అప్పటి గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన ఘనుడు టీడీపీ అధినేత చంద్రబాబే కదా. (TDP Mark Politics )

అలాంటి టీడీపీ ఇప్పుడు అడ్డగోలు వాదనలు తెరపైకి తెస్తే ఏంటి ప్రయోజనం.? అసెంబ్లీకి వెళ్ళేది లేదన్నారు.. కౌరవ సభ అన్నారు.. కానీ, సభకు హాజరయ్యారు. గలాటా సృష్టించారు. కేవలం గలాటా కోసమే అసెంబ్లీకి టీడీపీ శాసన సభ్యులు వెళ్ళారన్నట్టుగా తయారైంది పరిస్థితి.

‘పెద్దాయన గవర్నర్.. ఆయన్ని గౌరవించకపోతే ఎలా.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ప్రజల దృష్టిలో ప్రతిపక్షం పలచనైపోయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే ఈ రగడ అంటే, ముందు ముందు టీడీపీ.. తాము అసెంబ్లీలో వుండేందుకు ఇష్టపడుతుందో లేదో.!