వైసీపీకి భయపడుతున్న టీడీపీ నేతలు, ఆందోళనలో చంద్రబాబు నాయుడు

EX TDP leaders feeling sad about their situation

2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ నాయకులు గతంలో తమను ఇబ్బందులకు గురి చేసిన టీడీపీ నాయకులకు చుక్కలు చూపిస్తూ కక్ష్య పూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు ఆ ఇబ్బందులు భరించలేక వైసీపీలోకి కూడా వెళ్లారు. అలాగే చాలామంది టీడీపీ నేతలు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చి కేవలం 15 నెలలు మాత్రమే కావొస్తుంది. ఇప్పుడే టీడీపీ నేతలు వైసీపీకి భయపడి బయటకు రావడం లేదు.

cbn
cbn

ఆందోళనలో చంద్రబాబు నాయుడు

గతంలో రానున్న కాలాన్ని ఉహించలేని చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులను, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆ కోపాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు చూపిస్తున్నారు. అయితే వైసీపీని దెబ్బతియ్యడానికి చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆయనకు తోడుగా నడవడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దింతో చంద్రబాబు నైదులో ఆందోళన మొదలయింది. టీడీపీ నాయకులకు పదవులు ఇచ్చిన్నప్పటికి వైసీపీపై యుద్ధానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఇలా టీడీపీ నాయకులు వైసీపీకి భయపడుతుండటంతో చంద్రబాబు నాయుడులో ఆందోళన మొదలైంది.

ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కూడా రావడం లేదు

ఇక అసెంబ్లీ సమావేశాల్లోనూ తనకు అండగా నిలబడే వారు పెద్దగా లేరు. పేరుకు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నలుగురైదుగురు మినహా ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే చంద్రబాబు లో ఫ్రస్టేషన్ పీక్స్ లోకి వెళుతుందంటున్నారు. జగన్ ను నేరగాడుగా తరచూ మాట్లాడుతున్నారు. ఫేక్ సీఎం అని జగన్ కు కొత్త బిరుదు ఇచ్చారు. ఎన్నికల ముందు కూడా జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడాన్ని కూడా చంద్రబాబు గుర్తించడం లేదు. ఇలా తనకు తన పార్టీ ఎమ్మెల్యేల నుండి కూడా మద్దతు లభించకపోవడం వల్ల టీడీపీని ఎలా బతికించాలో చంద్రబాబు నాయుడుకి తెలియడం లేదు.