టీడీపీ ఫ్యాన్స్ తో పాటు చంద్రబాబు కూడా నమ్మలేకపోయాడు – పార్టీకి ఆ జంట రాజీనామా !

former tdp minister resigned

టీడీపీలో ఉన్న చాలామంది నాయకులు ఎన్టీఆర్ అభిమానులుగా పార్టీలోకి వచ్చారు. అలా వచ్చిన వారిలో తాళ్ళపాక రమేష్ రెడ్డి ఒకరు, ఎన్టీఆర్ కు ఆయన వీరాభిమాని. ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్నప్పుడు అఖిల భారత ఎన్టీఆర్ అభిమానుల సంఘానికి రమేష్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రి వరకు ఎదిగారు. అయితే ఇప్పుడు ఆయనకు టీడీపీ రావాల్సినంత గుర్తింపు మాత్రం రావడం లేదు. ఇప్పుడు పార్టీకి తాళ్ళపాక దంపతుల రాజీనామా టీడీపీలో కలకలం రేపుతోంది.

తాళ్ళపాకను పట్టించుకోని బాబు

1994లో వెన్నుపోటు తరువాత తాళ్ళపాక రమేష్ రాజకీయాల్లో కొంతవరకు సైలెంట్ గా ఉన్నారు. ఎన్టీఆర్ మరణం తరువాత మాత్రం ఆయన మళ్ళీ రాజకీయాల్లో అక్టీవ్ అయ్యారు. కానీ ఎందుకో ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. ఎన్టీఆర్ పై చెప్పులు విసిరిన వారికి బాబు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ తమను పట్టించుకోవడం లేదని రమేష్ వ్యాఖ్యానిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఉన్న చాలామంది టీడీపీ సీనియర్ నాయకుల కంటే కూడా తాళ్ళపాక టీడీపీ కోసం చాలా కష్టపడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం రమేష్ ను పార్టీకి దూరం పెడుతూనే ఉన్నారు. మొన్న కమిటీల ఏర్పాటు విషయంలో కూడా బాబు పక్షపాతం చూపించారని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాబు ఈ పక్షపాత రాజకీయాలు అవసరమా!!

టీడీపీ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందొ అందరికి తెలుసు. దాదాపు పతనం అంచుల్లో ఉంది. చాలామంది నాయకులు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీని బలోపేతం చెయ్యాలంటే నమ్మకంగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా కాకుండా పక్షపాత రాజకీయాలు చేస్తే పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది. వెన్నుపోటు పొడిచే నాయకులకు ఇచ్చే ప్రాధాన్యత నిజాయితీ గల నాయకులకు చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదో అర్ధం కావడం లేదు.