ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ప్రజల సమస్యల గురించి మాట్లాడటం, వాటి కోసం పోరాడటం ఎప్పుడో మార్చిపోయారు. ఇప్పుడు ప్రజా సమస్యలను అడ్డుపెట్టుకొని వ్యక్తిగత పగల కోసం కొట్టుకుంటున్నారు. కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అమరావతి రైతుల ఉద్యమం 400 రోజులకు చేరుకున్న సందర్భంగా కృష్ణ జిల్లాలోని గొల్లపూడిలో దీక్ష చెయ్యడానికి మాజీ మంత్రి దేవినేని ఉమా సిద్ధమయ్యారు. అయితే ఆ దీక్షను పోలీసులు అడ్డుకుంటున్నారు. గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తన నివాసంలోనే దేవినేని దీక్షకు దిగారు.
జగన్ టార్గెట్ చేసిన దేవినేని
ఈ దీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దేవినేని ఉమా టార్గెట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో అంబెడ్కర్ యొక్క రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని దేవినేని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న పోలీసులను వైసీపీ కార్యకర్తలుగా జగన్ వాడుకుంటున్నారని, జగన్ రెడ్డి చేస్తున్న చట్టవ్యతిరేకమైన పనులను చెయ్యలేక చాలామంది పోలీసులు ఆత్మహతలు చేసుకున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ రైతులను పట్టించుకోరా!!
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు రోడ్డుపాలు అయ్యారు. రాజధానిని విశాఖకు తరలించవద్దని రైతులు ఉద్యమం చెయ్యబట్టి 400 రోజులు గడుస్తున్నప్పటికి జగన్ రెడ్డి వాళ్ళతో కనీసం చర్చలు కూడా జరపడం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతో జగన్ రెడ్డి రైతులను అష్టకష్టాలు గురి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.