టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సీఎం కుర్చీపై ఉన్న మక్కువ అందరికి తెలుసు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికి తానే సీఎంగా ఉండాలని బాబు అనుకున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ కల చేదిరిపోయింది. అలా జగన్ రెడ్డి బాబు కలను చెరిపెయ్యడాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు మళ్ళీ సీఎం కుర్చీపై కూర్చోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి వైసీపీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆరోపిస్తూ వస్తున్నారు. మళ్ళీ సీఎం కుర్చీపై కూర్చోవడానికి బాబు చేస్తున్న పనులు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
జగన్ పై అనవసర దూషణ
చంద్రబాబు ఐదేళ్లు ఎలా పాలించారో తెలియంది కాదు. ఆయనకు అప్పుడు గుర్తుకు రాని సమస్యలు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. గ్రామ పంచాయతీకి ఏడాదికి కోటి రూపాయలు కేంద్రం నిధులు వస్తున్నాయని చెబుతున్నారు. ఆయన పాలన సాగించినప్పుడు మాత్రం కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి అస్సలు మాట్లాడరు. అంతా తన ఘనతే అని చాటుకోటానికే ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపైన కూడా తన స్టిక్కర్ వేసుకుని మరీ ప్రచారాన్ని పొందారు. ఇప్పుడు మాత్రం కేంద్రం మంచిది. నిధులు దండిగానే ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే దానిని సక్రమంగా వినియోగించడం లేదని ఊదరగొడుతున్నారు.
బాబుకు ఓపిక తగ్గిందా!!
బాబుకు వయసు మీద పడటం వల్ల ఓపిక బాగా తగ్గిపోయింది. వచ్చే ఎన్నికల సమయం వరకు ఆగలేకపోతున్నారు. అందుకే జగన్ పై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇరవై నెలలుగా చూస్తే జగన్ ను సక్రమంగా తాను అనుకున్న రీతిలో ఎక్కడ పాలన చేయించారన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వాటి ద్వారా అడ్డుకుంటూ జగన్ ను జనం గెలిపించినా తన తడాఖా ఏందో తెలుసుకోమని ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారు. ఏది ఏమైనా మరో మూడేళ్లు చంద్రబాబు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ప్రజల్లో నిజంగా వ్యతిరేకత వస్తే జగన్ ను కూడా ఇంటికి పంపుతారు. అంతవరకూ ఆగలేక ఇలా ఫ్రస్టేషన్ కు లోనవుతుంటే అభాసుపాలు కావడమే కాదు.. మరోసారి అపజయమూ తప్పదు.