Nara Lokesh: చంద్రబాబు ఇస్తే తీసుకుంటా…. డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ కామెంట్స్?

Nara Lokesh: ఏపీ కూటమి పార్టీలలో అలజడి మొదలైంది అంటూ గత కొద్దిరోజులుగా ఒక వార్త సంచలనంగా మారింది. అందులో భాగంగానే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ ఎంతో మంది నేతలు మీడియా ముందుకు వచ్చి వారి అభిప్రాయాలను తెలియజేశారు అయితే ఈ అభిప్రాయం వెనుక చంద్రబాబు హస్తం ఉంది అనే అనుమానాలు కూడా కలిగాయి. ఇలా ఎంతోమంది కీలక నేతలు డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ఉండాలి అంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చివరికి అధిష్టానం కూడా స్పందిస్తూ ఈ వార్తలకు చెక్ పెట్టారు.

ఇదిలా ఉండగా తాజాగా నారా లోకేష్ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. కోర్ట్ హాజరు అనంతరం ఈయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా మరోసారి డిప్యూటీ సీఎం పదవి గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా తనకు డిప్యూటీ సీఎం పదవి రావడం గురించి నారా లోకేష్ మాట్లాడుతూ…తనకు పదవులు ముఖ్యం కాదని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన తనకు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు అప్పచెప్పిన తీసుకుంటానని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. మరోవైపు ఒకే వ్యక్తి ఒకే పదవిలో మూడుసార్లు కొనసాగడం సరికాదనేది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ లోకేష్ తెలిపారు ఈ విషయంపై తాను పార్టీ నేతలతో మాట్లాడి క్లారిటీ ఇస్తామని వెల్లడించారు.

ప్రస్తుతం నారా లోకేష్ మంత్రిగా అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకోబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పదవిలోనే కొనసాగాలని అప్పుడే అందరికీ అవకాశాలు కూడా వస్తాయని లోకేష్ తెలిపారు .ఈరోజు సాయంత్రమే తాను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటున్నానని లోకేష్ తెలిపారు. మంత్రిగా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడం కోసమే తాను కృషి చేస్తానని లోకేష్ వెల్లడించారు.