ఆ జిల్లాల్లో టీడీపీకి స్థానిక ఎన్నికల్లో కూడా ఓటమి తప్పేట్టు లేదుగా!!

2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ టీడీపీ యొక్క పరిస్థితి ఎలా ఉందొ అందరికి తెలుసు. దాదాపు పార్టీ పతనావస్థకు చేరుకుంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తమ పార్టీ ఇంకా బలంగానే ఉందని, ఇప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీనే గెలుస్తుందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఎన్నికల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న బాబుకు ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చి, తన సత్తా ఎంతో నిరూపించుకోమని సవాల్ విసిరాయి. ఈ స్థానిక ఎన్నికల్లో కూడా టీడీపీకి ఓటమి తప్పదని, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అయితే టీడీపీకి కనీసం ఒక్క స్థానం కూడా రాదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

Cbn
cbn

కీలక నాయకులు పార్టీకి దూరం

2014లో పార్టీ విజ‌యం సాధించ‌డంతో ప‌దేళ్ల త‌ర్వాత జిల్లాలో పార్టీకి కాస్త జ‌వ‌స‌త్వాలు వ‌చ్చాయి. స్థానిక ఎన్నిక‌ల్లోనూ చాలా ఏళ్ల త‌ర్వాత జ‌డ్పీచైర్మ‌న్ పీఠం సొంతం చేసుకుని పుంజుకుంది. ఇక‌, వైసీపీ నుంచి కూడా వ‌చ్చిన నాయ‌కులు పార్టీని మ‌రింత బ‌లోపేతం చేశారు. క‌ట్ చేస్తే గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో జిల్లాలో అన్ని సీట్లు వైసీపీ స్వీప్ చేసి ప‌డేసింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ మళ్ళీ క్లీన్ స్వీప్ చేస్తుందా అంటే చేస్తుందనే వాదనే వినిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమితో పార్టీలో ఉన్న కీలక నేతలు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక‌ గ‌తంలో ప‌ద‌వులు అనుభ‌వించిన వారు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. మ‌రికొంద‌రు లోపాయికారీగా.. అధికార పార్టీకి చేర‌వ‌య్యారు. దీంతో పార్టీ త‌ర‌ఫున పెద్దగా రియాక్ట్ అవుతున్న వారు కూడా క‌నిపించ‌డం లేదు.

అశోక్ ను టార్గెట్ చేసిన వైసీపీ

ముఖ్యంగా పార్టీ సీనియ‌ర్ నాయకుడు, మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజుకు గ్రూపుల గోల ఎక్కువగా ఉంది. ఆయ‌న‌ను త‌మ‌ను తొక్కేశార‌ని.. మ‌హిళా నాయ‌కులతో పాటు ఓ సామాజిక వ‌ర్గం నేత‌లు గుర్రుగా ఉన్నారు. మ‌రికొంద‌రు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీ అయ్యారు. పైగా ప్రభుత్వం అశోక్‌కు వ‌రుస షాకులు ఇస్తూ.. ఆయ‌న్ను మాన్సాస్ ట్రస్టుతో పాటు ప‌లు ఆల‌యాల చైర్మన్ హోదా నుంచి వ‌రుస‌గా తొల‌గిస్తూ వ‌స్తోంది. దీంతో ఆయ‌న రాజ‌కీయంగా సైలెంట్ అయిపోయారు. ప‌ద‌వులు రానీ మాజీ టీడీపీ ఎమ్మెల్యేల‌ది అదే ప‌రిస్థితి. ఫ‌లితంగా జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. ఇక ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles