Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పోటీ చేసే అద్భుతమైన మెజారిటీ అందుకున్న విషయం తెలిసిందే. ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నిజానికి పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ పోటీ చేయాల్సి ఉండగా పొత్తులో భాగంగా చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కు సీట్ ఇవ్వడంతో వర్మ తన సీటును త్యాగం చేయాల్సి రావడమే కాకుండా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేస్తూ ఆయన విజయానికి కూడా కారణమయ్యారు.
ఇక పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక పవన్ కళ్యాణ్ వర్మ సహాయంతోనే విజయం సాధించారు కానీ పవన్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు మాత్రం పిఠాపురం జనసేన అడ్డా అంటూ మాట్లాడారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రజల అభిమానంతోనే గెలిచారు కానీ ఎవరి అండదండలతో గెలవలేదు అంటూ ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు జనసేన వర్సెస్ టిడిపి అనే విధంగా పిఠాపురంలో అలజడులను సృష్టించాయి.
ఇకపోతే తాజాగా కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో భాగంగా పిఠాపురం ఇన్చార్జి వర్మ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గ్రౌండ్ లెవెల్ లో పిఠాపురం బలం ఎంతుందో అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా వేదికపై ఓ నాయకుడు మాట్లాడుతూ…పిఠాపురం అంతా కూడా టీడీపీనే ఉందని స్పష్టం చేశారు. టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న వర్మ పొత్తులో భాగంగా తన సీటును త్యాగం చేయడంతోనే పవన్ కళ్యాణ్ గెలిచారని తెలిపారు.
వర్మ గత 25 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు అలాగే పార్టీ కోసం సొంత నిధులను కూడా ఖర్చు చేశారు.పిఠాపురంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలను, కార్యకర్తలను పేరు పెట్టి పలకరించేంత సన్నిహితం ఆయనకు ఉందని పేర్కొన్నారు. పిఠాపురంలో టిడిపి బలం 80 శాతం ఉంటే, జనసేన బలం 20 శాతం మాత్రమే ఉందని ఉందని తెలిపారు. వర్మ మద్దతు తెలియజేయకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు సాధ్యమయ్యేది కాదని తెలియడంతో పిఠాపురం జనసేన అడ్డా అన్న నాగబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అయింది.