ఆయన అడుగుపెడితే గానీ టీడీపీని సేవ్ చేయడం కష్టం అంటున్నారు.. బాబుగారూ వింటున్నారా ? 

Chandrababu Naidu
గత ఎన్నికల్లో చాలా చోట్ల గెలుస్తారని అనుకున్న టీడీపీ అభ్యర్థులు అనూహ్య రీతిలో ఓడిపోయారు.  కన్ఫర్మ్ అనుకున్న నియోజకవర్గాలు చేజారిపోయాయి.  అలాంటి నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా కొవ్వూరు కూడ ఒకటి.  ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట.  పార్టీ తరపున ఎవరు నిలబడినా గెలుస్తారనే నమ్మకం ఉండేది.  2014లో రాజకీయాలకు కొత్తే అయినప్పటికీ టీడీపీ తరపున నిలబడ్డారు కాబట్టి జవ‌హ‌ర్‌ను గెలుపొందారు.  మొదటిసారి పోటీలో గెలవడమే కాదు మంత్రి పదవి కూడా అందుకున్నారు ఆయన.  లోకల్ వ్యక్తి కావడంతో స్థానిక సమస్యల మీద జ‌వ‌హ‌ర్‌కు మంచి అవగాహన ఉంది.  అందుకే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపారు. 
 జవ‌హ‌ర్‌
 
కానీ స్థానిక టీడీపీ నేతలు కొందరికి జవహర్ అంటే గిట్టలేదు.  కారణం సామాజిమవర్గాలే.  అందుకే మంత్రిగ ఉన్న జ‌వ‌హ‌ర్‌కు సహకరించకపోగా ఇబ్బందులు కూడా సృష్టించారు.  అయినా జవహర్ ముందుకే సాగి మంచి పేరు తెచ్చుకున్నారు.  కానీ 2019 ఎన్నికల్లో ఒత్తిడి ద్రుష్ట్యా చంద్రబాబు  జ‌వ‌హ‌ర్‌ను కొవ్వూరు నుండి కాకుండా తిరువూరు నుండి పోటీకి దించారు.  జవహర్ సైతం అయిష్టంగానే ఒప్పుకున్నారు.  కానీ అంతగా అవగాహన లేని తిరువూరులో జవహర్ ఓడిపోయారు.  అలాగే కొవ్వూరులో పోటీ చేసిన అనిత కూడ ఓడిపోయారు.  ఫలితంగా గెలవాల్సిన జవహర్ ఓటమితో పాటు ఒక నియోజకవర్గం చేజారిపోయింది. 
 
ఓడిపోయిన అనిత ఎన్నికల తర్వాత కొవ్వూరును విడిచిపెట్టేశారు.  అక్కడ ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది.  టీడీపీ కేడర్ అంతా కొవ్వూరు నుండి జవహర్ బరిలో ఉండి ఉంటే తప్పక గెలిచేవారు.  లోకల్ కాకపోవడం వలనే అనిత ఓడిపోయారు అంటున్నారు.  అంతేకాదు జ‌వ‌హ‌ర్‌కు తిరిగి కొవ్వూరు బాధ్యతలు అప్పగించాలని, అప్పుడే నియోజకవర్గంలో పార్టీ నిలదొక్కుకుంటుందని, ఇతర సామాజిక వర్గంతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటే తిరిగి పట్టు సాధించవచ్చని చంద్రబాబుకు తెలియజేస్తున్నారు.  మరి బాబుగారు వారి మాటలకు గౌరవం ఇచ్చి జ‌వ‌హ‌ర్‌ను కొవ్వూరుకు తీసుకొచ్చి అక్కడ పార్టీని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.