విశాఖజిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమీషనర్ తోట కృష్ణవేణి ని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు దూషించిన సంగతి తెలిసిందే. అసభ్య పదజాలంతో కృష్ణ వేణిని దూషించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అయ్యన్నపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసారు. ఇలా మొత్తంగా సెక్షన్ 354 ఏ(4), 500,504,505-1, 502-2, 506, 509ప్రకారం కేసులు నమోదు అయ్యాయి. తాజాగా స్థానికంగా అయ్యన్న ఆ లేడీ కమీషనర్ ని ఎలాంటి పదజాలంతో దూషించారో స్థానికంగా అక్కడ ఉండేవారు? ఆ సమయంలో అక్కడున్న వారు కృష్ణవేణిని చాలా ఘోరంగా అవమానించినట్లు చెబుతున్నారు. ఇప్పుడా వార్త స్థానిక సాయంకాలపు పత్రికల్లోనూ సంచలనంగా మారింది. అసలు వివాదం ఎలా మొదలైంది అంటే..
మున్సిపల్ కౌన్సిల్ హాల్ అధునీకరణ పనులు జరుగుతోన్న నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్ర పటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్ గదిలోకి మార్చారు. కానీ ఆఫోటోను యధాస్థానంలో ఉండాలని ఈనెల 15 కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. దీంతో సిబ్బంది హాలులో రంగులు వేస్తున్నామని, అందుకు సమయం పడుతుందని, ఆ పనులన్నీ పూర్తయిన తర్వాత మళ్లీ అయ్యన్న అడిగినట్లే యధాస్థానంలోనే పెడతామని కమీషనర్ కృష్ణవేణి వివరించారు. దీంతో ఆగ్రహించిన అయ్యన్న నోటి దూరుసుతో ఫోటో తీసే అధికారం ఎవడించ్చాడంటూ నొటికొచ్చినట్లు మాట్లాడారుట.
స్థానిక ఎమ్మెల్యేకు కృష్ణవేణి తొత్తుగా మారారంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే అయ్యన్న పోలీసులు, పెద్దల సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లో ఎక్కడి ఫోటోని అక్కడ పెట్టకపోతే కమీషనర్ బట్టలు ఊడదీస్తానని హెచ్చరించారు. కమీషనర్ ఆడదైపోయింది. మగాడైతే ట్రీట్ మెంట్ ఈపాటికే మరోలా ఉండేదని బెదిరించారుట. దీంతో కమీషనర్ మనస్థాపం చెంది పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అయ్యన్న తీరుపై కృష్ణ వేణి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆమె సామాజిక వర్గం వారు మండిపడుతున్నారు. అయ్యన్నకు ఎంత ధైర్య ఉంటే ఓమహిళపై ఇష్టాను సారం నోరు పారేసుకుంటాడంటూ మండిపడుతున్నారు. అధికారంలేనప్పుడే ఇలా ఎగిసిపడుతున్నాంటే అధికారంలో ఉంటే ఇంకెంత ఎగసి పడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చేసిన తప్పుకు వెంటనే కృష్ణవేణికి క్షమాఫణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.