ఆకాశంలో సగం.! బూతుల్లోనూ సమానం.! అంతేనా.?

మహిళ అంటే, ఆకాశంలో సగం.. అన్నింటా సగం అంటారు.! మరి, బూతుల్లో ఎందుకు సగం కాకూడదు.? అనుకున్నట్టున్నారు. మహిళా నేతలూ, బూతులతో చెలరేగిపోతున్నారు. తమ వ్యవహార శైలితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని అపహాస్యం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన మహిళా నేతల తీరు, అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. మంత్రి రోజా ఒకప్పుడు ఎలా మాటల తూటాలు పేల్చేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆమె తీరుపై తీవ్ర వ్యతిరేకత.. సర్వత్రా వ్యక్తమయ్యేది.
కొడాలి నాని చూపిన బాటలో.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘బూతులు’ అనగానే గుర్తుకొచ్చే పేరు కొడాలి నానిదే. మంత్రిగా వున్న సమయంలోనే ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోలేకపోయేవారు. పైగా, బూతులు మాట్లాడటం అంటే, రాజకీయంగా తన జన్మ హక్కు అనుకునేవారాయన. ఇప్పుడాయనకు చాలామంది పోటీ వచ్చేశారు.

మహిళలూ ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేశారు.. బూతుల్ని. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మీద తాజాగా వైసీపీ మహిళ నేత ఒకరు బూతుల దండకం అందుకున్నారు. అయ్యన్న, ముఖ్యమంత్రి మీద చేస్తున్న బూతుల దాడికి ఇది కౌంటర్ ఎటాక్ అన్నమాట.

సరిపోయింది సంబరం.! అందరూ కలిసి రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టుపట్టించేస్తున్నారన్నమాట.