ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో తెలివితేటలను ఉపయోగించి ఇతరులను ఎంతో సులభంగా మోసం చేస్తున్నారు.అధిక డబ్బులు ఆశ చూపెట్టడంతో చాలామంది ఎంతో సులభంగా ఇతరుల మాయలో పడి ఎన్నో వేల రూపాయల డబ్బులను నష్టపోతున్నారు. ఇప్పటికే కొందరు చిట్టిల పేరుతో పెద్ద ఎత్తున మోసం చేయగా మరికొందరు అధిక వడ్డీల ఆశ చూపెడుతూ దారుణంగా మహిళలను మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన నాగులుప్పలపాడు మండలం చదలవాడలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన మద్దెల శామ్యూల్, ఆయన భార్య కృష్ణవేణి అతి తెలివితేటలను ఉపయోగించి గ్రామములోని మహిళలకు అధిక వడ్డీ ఆశను చూపించి ఏకంగా వారి నుంచి కోటిన్నరకు పైగా డబ్బులు వసూలు చేశారు. అయితే ఇలా భారీ మొత్తంలో డబ్బు వారి చేతికి పడటంతో రాత్రికి రాత్రి గ్రామం వదిలి పారిపోయారు దీంతో బాధిత మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యాశకు పోయి తాము కష్టపడి సంపాదించిన డబ్బును మొత్తం వారి చేతిలో పెట్టామని అయితే దారుణంగా మోసపోయామంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధిత మహిళల సమాచారం ప్రకారం మద్దెల శామ్యూల్, ఆయన భార్య కృష్ణవేణి గ్రామ సర్పంచ్ గా పోటీ చేసే ఓడిపోయారు. ఇలా భారీగా నష్టపోవడంతో ఈ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు.అతి తక్కువ సమయంలోనే అధిక వడ్డీల ఆశ చూపించే గ్రామంలోని మహిళల చేత ఏకంగా కోటిన్నరకు పైగా డబ్బులు నగులు వసూలు చేశారు.దీంతో గ్రామ మహిళలు తమ డబ్బు నగలు తిరిగి ఇవ్వమని అడగగా మొహం చాటేస్తున్నారని ఇలా గట్టిగా నిలదీయడంతో తమను బెదిరిస్తున్నారనీ మహిళలు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.