విశాఖలో టీడీపీ బలం తగ్గిందా! మేయర్ ఎన్నికల కోసంఎదురు చూస్తున్న టీడీపీ, వైసీపీ నేతలు

రాజకీయ నాయకులకు సిద్ధాంతాలు, నియమాలు, నిబంధనలు ఉండవని చెప్పడానికి పార్టీ ఫిరాయింపులే కారణం. ఒక పార్టీ తరుపున గెలిచారంటేనే ప్రజలకు ఇంకో పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చకపోవడం వల్లే, అయితే నాయకులు గెలిచిన తరువాత సిగ్గు లేకుండా ప్రజలు తిరస్కరించిన పార్టీలోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీలో పార్టీ ఫిరాయింపుల రాజకీయాలు జరుగుతున్నాయి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఇప్పుడు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు విశాఖ టీడీపీ నాయకుడైన వాసుపల్లి గణేష్ వైసీపీ చెంతకు చేరడంతో అక్కడ టీడీపీ బలం తగ్గిందా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

TDP MLA Vasupalli Ganesh Kumar to Meet CM YS Jagan
TDP MLA Vasupalli Ganesh Kumar to Meet CM YS Jagan

విశాఖలో టీడీపీ బలం తగ్గిందా!

విశాఖలో టీడీపీకి బలం ఉందన్నది నిజం. అయితే విశాఖ రాజధాని ప్రకటన తరువాత అది తగ్గిందా లేదా అన్నది ఒక డౌట్. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నా కూడా ఒక్క వెలగపూడి రామక్రిష్ణ బాబు తప్ప మిగిలిన వారు సైలెంట్. ఇపుడు వాసుపల్లి బయటకు వచ్చాక సిటీలో వైసీపీ రీసౌండ్ చేస్తోంది. వాసుపల్లి గణేష్ ను బీసీ నాయకుడిగా ప్రమోట్ చేయాలని టీడీపీ అనుకుంది అయితే గణేష్ టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీ చెంతకు చేరుకున్నారు. వాసుపల్లి రాకతో వైసీపీ అక్కడ రెచ్చిపోతోంది. మరి టీడీపీ తమ్ముళ్లు దీనికి ఊరుకుంటారా. పైగా అక్కడ ఉన్నది మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.

మేయర్ ఎన్నికల్లో విజయం ఎవరిది?

ayyanna patrudu
ayyanna patrudu

వైసీపీలోకి వచ్చిన గణేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేయర్ సీట్ ను కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే నేపధ్యంలో మేయర్ సీట్ టీడీపీకే ఖరారని అయ్యన్న పాత్రుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు ముందు ఎన్నికలు పెట్టించండి, ఎవరు విజేతో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తామని, ఎంతమంది టీడీపీని వీడినా కూడా మాకేం కాదు, విశాఖ జనం ఎపుడూ సైకిల్ పార్టీ వైపేనని, మేయర్ సీటు కూడా మాదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.