టీడీపీ అధక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొత్త స్టెప్ తీసుకున్నారు. ఓటమి తర్వాత పార్టీ ప్రవర్తనలో సమూల మాపు అవసరమని భావించిన ఆయన ఎన్నో నెలలు ఆలోచించి పార్లమెంట్ అధ్యక్షుల్ని ఏర్పాటుచేయాలని దిసాద్ అయ్యారు. అయితే ఇదేమీ కొత్తగా చంద్రబాబు బుర్ర నుండి పుట్టిన ఆలోచన కాదు. గతంలో చాలామంది రాజకీయ పార్టీల అధినేతలు పాటించిన విధానమే. అయితే టీడీపీకే ఆ విధానం కొత్త. సరే ఎలాగూ కాపీ విధానాన్ని తీసుకున్నారు.. దాన్నైనా గొప్పగా అమలుచేసి పార్టీన బలోపేతం చేస్తే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు ఆశించారు. కానీ అందులో కూడ చంద్రబాబు తన పాత ధోరణినే అవలంభించి శ్రేణులను అసంతృప్తోకి గురిచేశారు.
కొత్త విధానం, కొత్త అధ్యక్షులు అన్నప్పుడు అంతా కొత్తగానే ఉండాలి. అప్పుడే శ్రేణులకు ఉత్సాహం ఉంటుంది. అయితే చంద్రబాబు నియమించిన పార్లమెంట్ అధ్యక్షులంతా పాతవాళ్లే. ఒకప్పుడు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బాహ్యతలు నిర్వహించినవారు. వాళ్ళ వలన గత ఎన్నికల్లో ఒరిగిందేమీ లేదు. గెలవాల్సి చోట్ల కూడ మట్టికరవాల్సి వచ్చింది. అసలు ఎన్నికల మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోవడం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించడం మూలంగానే వ్యవహరించడం వలనే ఇంత దారుణమైన ఓటమి అనే అభిప్రాయం శ్రేణుల్లో బలంగా ఉంది. కొత్త విధానంతో ఆ అభిప్రాయాన్ని తొలగించాలి కానీ మళ్ళీ అదే పాత లీడర్ల కిందకి నియోజకవర్గాలను తీసుకొస్తే ఏం ప్రయోజనం ఉంటుంది, బాబుగారి వ్యవహారం అంతా కొత్త సీసాల్లో పాత నీళ్ళే అనేలా ఉందని అంటున్నారు.
చంద్రబాబు నియమించినవారిలో విజయవాడకు నెట్టెం రఘురాం, మచిలీపట్నంకు కొనకళ్ళ నారాయణ, గుంటూరుకు తెనాలి శ్రవణ్ కుమార్, నరసరావుపేటకు జీవి ఆంజనేయులు, బాపట్లకు ఏలూరి సాంబశివరావు, ఒంగోలుకు డాక్టర్ నుకసాని బాలాజీ, నెల్లూరుకు షేక్ అబ్దుల్ అజీజ్, చిత్తూరకు పులివర్తి నాని, తిరుపతికి నర్సింహా యాదవ్, కడపలో మల్లెల లింగారెడ్డి, రాజంపేటకు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, కర్నూలులో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు, హిందూపురంలో బికె పార్థసారథి, శ్రీకాకుళంకు కూన రవికుమార్ ఇలా దాదాపు అందరూ పాతవారే గత ఎన్నికల్లో ఓడినవారే ఉన్నారు. ఇదే తెలుగు తమ్ముళ్ల ఆవేదన.