TDP: వైకాపా కంటే ముందుగానే ప్రజలలోకి కూటమి నేతలు…. ప్రణాళికలు సిద్ధం!

TDP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి కేవలం ఆరు నెలలు పూర్తి చేసుకుంది అయితే ఈ ఆరు నెలల వ్యవధిలోని కూటమి నేతలందరూ కూడా తిరిగి జనంలోకి రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు వంటి వారందరూ కూడా వివిధ జిల్లాలలో పర్యటిస్తూ ప్రజలలోకి రావడానికి ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజలలోకి రావడానికి కారణం లేకపోలేదు.

రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీలను పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసమే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఇలా ప్రజలలోకి వచ్చి తమ ఆరు నెలల పరిపాలన గురించి ప్రజలందరికీ తెలియచేయాలనే ఆలోచనలు కూటమినేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నుంచి సరికొత్త కార్యక్రమాలతో ప్రజల ముందుకు రాబోతున్నట్లు నారా లోకేష్ వెల్లడించారు.

ఫిబ్రవరి నుంచి స్వర్ణాంధ్ర పేరుతో కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. తీసుకువచ్చిన పెట్టుబడులు.. తద్వారా రాష్ట్రానికి కలిగే ప్రయోజనం.. వచ్చే ఉపాధి, ఉద్యోగాలు వంటివాటిని వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఇలా చేయటం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేసింది అనే సందేహాలు వ్యక్తం చేస్తున్న కొన్ని వర్గాల వారికి క్లారిటీ వస్తుందని తెలిపారు.

ఇలా స్వర్ణాంధ్ర పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయాలని లోకేష్ ఆదేశాలను జారీ చేశారు. అయితే మరోవైపు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం తన కార్యకర్తలకు నేతలకు కూడా కొన్ని దిశా నిర్దేశాలు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి కూడా ఈయన ప్రతి జిల్లా పర్యటనకు వెళ్లడమే కాకుండా బుధ గురువారాలలో ఆయన నియోజకవర్గాలలో నిద్ర చేసి అక్కడి ప్రజలతో ఏకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా కూటమి పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేయనున్న సంగతి తెలిసిందే.

నిజానికి జగన్ సంక్రాంతి తరువాతనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సి ఉండగా ఈయన తన కుమార్తె మాస్టర్ డిగ్రీ పట్టా అందుకోబోతున్న నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లారు. దీంతో ఈ కార్యక్రమం కాస్త ఫిబ్రవరి వాయిదా పడింది ఈ క్రమంలోనే కూటమి నేతలు సైతం ప్రజలలోకి రావడానికి సిద్ధమయ్యారు.