న‌డుము అందాల‌తో రెచ్చ‌గొడుతున్న త‌మ‌న్నా.. వైర‌ల్‌గా మారిన హాట్ పిక్

ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే అందం త‌మ‌న్నాది. అభిమానులు ఆమెను ముద్దుగా మిల్కీ బ్యూటీ, త‌మ్మూ బేబి అని పిలుచుకుంటూ ఉంటారు. గ‌త ఏడాది క‌రోనా బారిన ప‌డిన ఈ ముద్దుగుమ్మ చాలా భ‌య‌ప‌డింది. త‌న‌కు ఏమ‌వుతుందో అని ఆవేద‌న చెందింది. అయితే వైద్యులు ఆమె విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రిచి క‌రోనా నుండి కోలుకునేలా చేశారు. అయితే క‌రోనా నుండి కోలుకున్న త‌ర్వాత త‌మ‌న్నా శ‌రీరంలో చాలా మార్పులు క‌నిపించాయి. బొద్దుగా మార‌డంతో చాలా మంది నెటిజ‌న్స్ శ‌రీరాకృతిపై ప‌లు కామెంట్స్ చేశారు. దీనిపై తమ‌న్నా ఘాటుగానే బ‌దులిచ్చింది.

ప్ర‌స్తుతం గోపించంద్ స‌ర‌స‌న సీటీమార్ అనే చిత్రం చేస్తుండ‌గా ఇందులో తెలంగాణ క‌బ‌డ్డీ కోచ్ పాత్ర‌లో అల‌రించనుంది. మరోవైపు అంధాధున్ రీమేక్‌లో నితిన్‌తో జ‌త‌క‌ట్ట‌నుంది. ఇందులో కాస్త బోల్డ్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు టాక్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది . ఇక వెంకటేష్, వరుణ్ తేజ్,.. ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లో నటిస్తోంది.ఇటీవ‌ల చిత్ర షూటింగ్‌లోను జాయిన్ అయింది ఈ అమ్మ‌డు. లొకేష‌న్‌లో దిగిన ప‌లు ఫొటోలు కూడా షూర్ చేసింది. ఇవే కాక ‘గుర్తుందా శీతాకాలం’ , బోల్ చుడియాతో పాటు ఈమె హీరోయిన్‌గా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ది చేజ్ అనే సినిమా కూడా త‌మ‌న్నా చేస్తుంద‌ని టాక్. త‌మ‌న్నా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 15 ఏళ్ళు కాగా, పనిపై ఎంతో నిబ‌ద్ధ‌త‌గా ఉంటుంది. తన డ్యాన్సులతో పాటు, తగినన్ని అంద చందాలను ఒలకబోస్తూ తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లో సత్తాను చాటుతోంది త‌మ‌న్నా.అయితే క‌రోనా త‌ర్వాత కాస్త లావైన త‌మ‌న్నా మ‌ళ్ళీ పాత లుక్‌లోకి మారేందుకు జిమ్‌లో తెగ వ‌ర్క‌వుట్స్ చేస్తుంది. అంతేకాదు ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలోను షేర్ చేస్తుది. తాజాగా త‌మ‌న్నా షేర్ చేసిన హాట్ ఫొటో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.