Tamil Hero : ఆ తమిళ హీరో తెలుగులో చేయబోయే తొలి ప్రాజెక్ట్ ఏంటో తెలుసా.?

Tamil Hero : టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ కింగ్‌గా చెప్పుకోవచ్చు విక్టరీ వెంకటేష్‌ని. ఆయన గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్, నాగచైతన్య, వరుణ్ తేజ్.. ఇలా స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అనే తేడా లేకుండా స్ర్కీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో చాలా వరకూ హిట్ సినిమాలే అని చెప్పొచ్చు.

లేటెస్టుగా మరోసారి వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ లోపు మరో మల్టీ స్టారర్ ప్రాజెక్టు వెంకీ కోసం ముస్తాబవుతోందట. ఈ సారి తెలుగు హీరోలతో కాదు, ఓ తమిళ యంగ్ హీరోతో వెంకీ సందడి చేయబోతున్నాడు.
ఆయన మరెవరో కాదు, శివ కార్తికేయన్. శివ కార్తికేయన్ నటించిన ‘రెమో’, శక్తి’ తదితర సినిమాలు తెలుగులోనూ ఆదరణ దక్కించుకున్నాయ్. ఇక ఈ తమిళ హీరో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించబోతున్నాడట.. అంటూ కొన్నాళ్లుగా కథనాలు వినిపిస్తున్నాయ్.
ఆ సినిమానే ఈ సినిమా అంటున్నారు. వెంకీ మామను, రెమో శివకార్తికేయన్‌నూ ఒకే స్ర్కీన్‌పై చూపించే ప్రయత్నం చేస్తున్న డైరెక్టర్ ఎవరో తెలుసా.? అనుదీప్ కేవీ. నవీన్ పోలిశెట్టితో ‘జాతిరత్నాలు’ వంటి హిట్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ ఈయన.
ఆల్రెడీ శివకార్తికేయన్‌తో అనుదీప్ ఓ సినిమా చేస్తున్నాడు. అది ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. అది పూర్తి కాగానే ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ టేకప్ చేయనున్నాడట. చూడాలి మరి, వెంకీ మామతో రెమో చేయబోయే తొలి ప్రాజెక్టు  సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ అవుతుందో లేదో.