“శక్తి” సినిమాపై అసలు నిజం బయట పెట్టిన దర్శకుడు.!

టాలీవుడ్ సినిమా వద్ద ఉన్నటువంటి కొన్ని హిస్టారికల్ ఎపిక్ డిజాస్టర్ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక నైట్ మెర్ అయినటువంటి చిత్రం “శక్తి” కూడా ఒకటి. మరి ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కి కూడా ఓ మర్చిపోలేని గాయం. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ఫలితంపై మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ సినిమా డిజాస్టర్ విషయంలో దర్శకుడు మెహర్ రమేష్ కొన్ని కామెంట్స్ రీసెంట్ గా చేయడం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. తాను ఈ చిత్రాన్ని ముందు మరో రకంగా ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్నానని కానీ కొందరు పెద్దలు సినిమా కథలో డివోషనల్ టచ్ ఇవ్వమండంతో నేను మర్చి తీశానని చెప్తున్నాడు.

మరి మరింత డీటెయిల్స్ లోకి వెళితే తాను ఎన్టీఆర్ తో హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాజిబుల్ టైప్ ఓన్లీ ఏక్షన్ డ్రామా ప్లాన్ చేసుకున్నాడట, కానీ తర్వాత నిర్మాత సూచనతో సినిమాకి ఆ శక్తి పీఠాలు లాంటి డివోషనల్ టచ్ యాడ్ చెయ్యాల్సి వచ్చింది అని..

కానీ నేను రాసుకున్న కాన్సెప్ట్ అయితే అది కాదని శక్తి ప్లాప్ అవ్వడంతో అయితే నా భాగం లేదని తాను చెబుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ సినిమా ఫలితాన్ని ఎవరూ మార్చలేనిది. కానీ ఈ దర్శకుడు అయితే లేటెస్ట్ గా ఈ నిజాన్ని బయటపెట్టడం ఆసక్తిగా మారింది.