టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి ఎన్నో ఎపిక్ డిజాస్టర్ చిత్రాల్లో ఈ రెండేళ్లలో అయితే ఒక ఆచార్య, ఒక “లైగర్” రీసెంట్ గా ఏజెంట్ చిత్రాలు అని చెప్పాలి. అయితే ఈ సినిమాలు వాటికి పెట్టిన బడ్జెట్ లో సగం కూడా రాబట్టలేదు. మరి ఈ చిత్రాలను పక్కన పెడితే కొన్నాళ్ల కితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా “శక్తి” కొట్టిన దెబ్బ అయితే మామూలుది కాదని చెప్పాలి.
కాగా ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కించగా మగధీర సినిమాని కొట్టాలన్న ఉద్దేశంతో ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా దెబ్బ అయితే ఎన్టీఆర్ ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ సినిమాని తన దగ్గర గుర్తు కూడా చేయొద్దు అంటాడు. అయితే అప్పట్లో ఈ సినిమాని నిర్మాత అశ్వనీదత్ సుమారు 40 కోట్లతో తెరకెక్కించారు.
కానీ ఈ సినిమా మాత్రం తనకి ఏకంగా 30 కోట్లకి పైగా నష్టాలు ఇచ్చింది అని చెప్పారు. ఈ సినిమా కొట్టిన దెబ్బకి ఇండస్ట్రీ నుంచి తాను బయటకి వెళ్ళిపోవాలి అనిపించేలా శక్తి చేసింది అని తెలిపారు. దానితో దాదాపు ఏడేళ్లు అలా సినిమాలు కూడా చేయలేదని అశ్వనీదత్ తెలిపారు.
ఇది మొత్తానికి శక్తి నష్టాల స్టోరీ లో కొత్త పాయింట్. ఇక ఇప్పుడు అశ్వనీదత్ అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఇప్పుడు ఇండియా లోనే బిగ్గెస్ట్ అండ్ కాస్ట్లీ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12 న పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. .