తమన్నాని ఇంకా అలాగే పిలుస్తున్నారట..”బాహుబలి” పై ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

టాలీవుడ్ సహా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ చాలా మందే ఉండొచ్చు కానీ అనేక అంశాల్లో టాలెంటడ్ ఉన్న హీరోయిన్స్ మాత్రం తక్కువే ఉంటారని చెప్పాలి. మరి అలంటి హీరోయిన్స్ లో ఓ పక్క మంచి గ్లామర్ అలాగే డాన్సింగ్ లో డైనమైట్ లాంటి హీరోయిన్ తమన్నా కూడా ఒకరు. 

అయితే ఈ హీరోయిన్ ఇప్పటికీ మంచి ఆఫర్స్ దక్కించుకుంటూ పలు భారీ సినిమాల్లోనే చేస్తుంది. మరి పాన్ ఇండియా మార్కెట్ లోకి మాత్రం ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు బాహుబలి ఫ్రాంచైజ్ తో ఈమె అడుగు పెట్టింది. దానితోనే మంచి క్రేజ్ ని తెచ్చుకున్న తమన్నా ఈరోజుతో బాహుబలి 1 సినిమా ఏడేళ్లు పూర్తి చేసుకోవడంపై తన కామెంట్స్ తెలియజేసింది. 

“ఈ సినిమా వచ్చి ఇప్పటికి ఏడేళ్లయినా కూడా ఇంకా నన్ను చాలా మంది ఈ సినిమాలో నేను చేసిన అవంతిక పాత్ర పేరుతోనే పిలుస్తారు. ఇది నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అని నిజంగా ఈ ఫ్రాంచైజ్ లో తాను నటించడం గర్వ కారణం అని ఆనందం వ్యక్తం చేసింది”. ఇక ప్రస్తుతం అయితే తమన్నా పలు తమిళ్ మరియు తెలుగు సినిమాల్లో నటిస్తుంది.