Taapsee Khanna : తాప్సీ కెరీర్ ఖతమ్ అయిపోయినట్లేనా.?

Taapsee Khanna : క్యూట్ అండ్ బబ్లీ లుక్స్‌తో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది అందాల భామ తాప్సీ. క్యూట్ అండ్ బబ్లీ హీరోయిన్‌గానే పేరు తెచ్చుకుంది. వెంకటేష్ వంటి స్టార్ హీరోయిన్ సరసన కూడా నటించింది. కానీ, తెలుగులో ఎందుకో స్టార్‌డమ్ దక్కించుకోలేకపోయింది.

బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ బాగానే సెటిలైంది. ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ పాత్రలు రావడంతో, ఇంకేముంది.. స్టార్ ‌డమ్‌ని తలకెక్కించుకుంది. సౌత్ సినిమాలను తిట్టడం మొదలెట్టింది. ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావునే తప్పు పట్టి, నాలుక కరుచుకుంది.

అయితేనేం, గోడకు కొట్టిన బంతిలా మళ్లీ టాలీవుడ్‌కి తిరిగి రాక తప్పలేదు. బాలీవుడ్‌లో సెటిలైపోయాకా, టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది తాప్సీ. ఇటీవలే, ‘మిషాన్ ఇంపాజిబుల్’ అంటూ ఓ సినిమాలో నటించింది తాప్సీ. మెగాస్టార్ చిరంజీవి అంతటోడే  ఈ సినిమాని ప్రమోట్ చేసినా, ఫలితం లేకపోయింది.

ఈ మధ్య తాప్సీ నుండి వస్తున్న సినిమాలన్నీ టాలీవుడ్‌లో దారుణంగా ఫెయిలవుతూనే వస్తున్నాయ్. దాదాపు సౌత్‌లో తాప్సీ కెరీర్ అయిపోయిందనే అంటున్నారు. అందుకు కారణం బక్కచిక్కిపోయి, ఫేడవుట్ అయిపోయిన ఆమె ఫీచర్సే.

టాలీవుడ్డే కాదు, బాలీవుడ్‌లోనూ తాప్సీకి అంత సీను లేదని తేల్చేశారు. ఒకటీ అరా సినిమాలు మాత్రమే వున్నాయి అక్కడ తాప్సీ చేతిలో. దాంతో తాప్సీకి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ తగ్గిపోయిందంటున్నారు. చూడాలి మరి, ఆ ఇమేజ్‌ని తాప్సీ ఎలా రికవర్ చేసుకుంటుందో.