Mission Impossible: తాప్సీ పన్ను సినిమా కోసం మాట ఇస్తున్న నవీన్..!

Mission Impossible: బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న తాప్సి, చాలా కాలం తర్వాత తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం తాప్సీ పన్ను ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే ఒక ఆసక్తికర చిత్రంలో నటిస్తోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు దర్శకత్వం వహించిన స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

చిన్న సినిమాలైన కథ ఆసక్తికరంగా ఉంటే చాలు సినిమా  ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. స్టార్ హీరో హీరోయిన్లు కూడా దర్శకులతో పని లేకుండా కథ నచ్చితే ఓకే చేస్తున్నారు. ఈ కోవలోనే తాప్సీ పన్ను కూడా వైవిద్యమైన కథతో తెరకెక్కుతోంది కాబట్టే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉన్నారు.ఈ చిత్రం హై ఎంటర్ టైన్ మెంట్ తోపాటు కొన్ని ఊహించని ట్విస్ట్ లు, కథనంలో వచ్చే మలుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. నమ్మశక్యంగాని ఓ నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ తన అద్భుతమైన రచన, టేకింగ్ తో కమర్షియల్ హంగులు జోడించి ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అన్ని కమర్షియల్ అంశాలతోవుంటూ యాక్షన్, థ్రిల్లింగ్ తో కూడిన పూర్తి ఎంటర్టైనర్ గా రూపొందింది.

ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను జోడించడానికి జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ సినిమాకు నవీన్ పొలిశెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఖచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. విడుదలకు ముందే ట్రైలర్ టీజర్ తో ఈ చిత్రం అద్భుతమైన స్పందన అందుకుంది. చిన్న సినిమాగా వస్తున్న అభిమానుల్లో హైప్ మాత్రం బాగా క్రియేట్ చేసింది.