ప్రస్తుతం ఎక్కడ చూసినా “కాంతార” సినిమా పేరే వినిపిస్తోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా అతని దర్శకత్వంలోనే తెరకెక్కిన కాంతార సినిమా సెప్టెంబర్ 30 వ తేదీన కన్నడ భాషలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషలలో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేశారు. అన్ని భాషలలో విడుదలైన ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలోనే 100 కోట్లు కొల్లగొట్టింది. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం రూ. 250 కోట్లు వసూలు చేసి ఇంకా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది.
ఇక తెలుగులో కూడా అల్లు అరవింద్ సమర్పణలో విడుదలైన ఈ సినిమా రూ.25 కోట్ల షేర్ ను సాధించే దిశగా దూసుకుపోతుంది.ఇక హిందీలో కూడా మంచి వసూళ్లు సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా పాపులర్ అయ్యాడు. ఇదిలా ఉండగా కాంతారా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రిషబ్ శెట్టి ఇదివరకే ఒక తెలుగు సినిమాలో నటించాడని చాలామందికి తెలియదు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు.
ఈ ఏడాది ఏప్రిల్ 1న రిలీజ్ అయిన ఈ మూవీలో ఓ సన్నివేశంలో రిషబ్ శెట్టి కనిపిస్తాడు. ’మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంలో అతను ఖలీల్ అనే పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన ముగ్గురు పిల్లలను మోసం చేసే పాత్రలో నటించాడు. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ లో ఆ ముగ్గురు పిల్లలు రఘుపతి,రాఘవ,రాజారం ఆర్.ఆర్.ఆర్ అంటూ తమ పేర్లు చెబుతుంటే.. ఖలీల్, జిలాని, ఫరూక్ కె.జి.ఎఫ్ అంటూ రిషబ్ శెట్టి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.