Swara Bhaskar: కోవిడ్ బారిన పడిన స్వర భాస్కర్.. క్షమించు దేవుడా అంటూ పోస్ట్..!

Swara Bhaskar: ప్రపంచ దేశాలలో కరోనా ప్రారంభమయ్యింది. కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ సాధారణ ప్రజలతోపాటు ప్రముఖుల మీద కూడా దాని ప్రభావం చూపుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కి కూడా కరోనా సోకింది. గతం కొన్ని రోజుల క్రితమే ఈ బాలీవుడ్ భామ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.2009లో నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇచ్చిన స్వర భాస్కర్ అనేక బాలీవుడ్ సినిమాలు , సిరీస్లు, టెలివిజన్ సీరియల్స్ లో నటించారు. తను వెడ్స్ మను, వీరి ది వెడ్డింగ్ లాంటి సినిమాలు ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకుంది . తాజాగా ఈ అమ్మడు చేసిన మరొక పోస్ట్ వైరల్ అవుతోంది .

ప్రస్తుతం స్వర భాస్కర్ ఢిల్లీలోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు . తాజాగా ఈ బాలీవుడ్ భామ తన కుటుంబ విషయాల గురించి సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇంస్టాగ్రామ్ లో తన తల్లితో జరిగిన సంభాషణ మొత్తం ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది . తన వాట్సాప్ చాటింగ్ లో నేను చేసిన గొప్ప పనుల్లో అమ్మను చిరాకు పెట్టడం గొప్ప పని అని స్వర అనగా.. దానికి వాళ్ళ అమ్మగారు రిప్లై ఇస్తూ.. నువ్వు ఏది చేసినా అది నీ వెంటపడుతుంది బాగా గుర్తు పెట్టుకో.. అంటూ వాళ్ళ అమ్మ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. దానికి స్వర వెంటనే స్పందిస్తూ..’ అమ్మ మీ సొంత బిడ్డను తిట్టడం ఇక ఆపండి..’ అంటూ రాసింది.

వాట్సాప్ చాటింగ్ నీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ దానికి ‘ నన్ను క్షమించు దేవుడా.. కోవిడ్ వచ్చిన కారణంగా ఇంట్లో ఉండి చాలా బోర్ ఫీల్ అవుతున్నా.. అందుకే ఇలా తన అమ్మగారితో చేసిన చాటింగ్ ఇలా షేర్ చేస్తున్నా ‘ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు కోవిడ్ వచ్చిన సంగతి తెలియజేస్తూ ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి , సరైన నిబంధనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. అంటూ స్వర భాస్కర్ పోస్ట్ చేశారు.