జగన్ వ్యవహార శైలి వల్ల ఇబ్బందుల్లో పడ్డ స్వామి స్వరూపానందేంద్ర

సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన వ్యవహార శైలిలో పాలన కొనసాగిస్తున్నారు. ఈ పాలన విధానం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు ఎందుకంటే ఆయన ప్రజా క్షేత్రంలో ఉండటం చాలా తక్కువ కాబట్టి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం జగన్ వ్యవహార శైలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయన సమస్యల పరిష్కారాల పట్ల వైసీపీ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దేవాల‌యాల‌పై దాడులు, క‌న‌క‌దుర్గ ఆల‌యంలో అప‌హ‌ర‌ణ‌లు, అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం వంటి ఘ‌ట‌న‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ వ్యవ‌హారం వివాదానికి దారితీసింది. అదే స‌మ‌యంలో తిరుమ‌ల‌లో డిక్లరేష‌న్ వివాదంపై కూడా జగన్మోహన్ రెడ్డి మౌనం పాటించి వైసీపీ నాయకులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చారు.

YS Jagan special interest on three districts
YS Jagan special interest on three districts

వెంకన్న సాక్షిగా మరో వివాదంలో వైసీపీ

ఇప్పటికే రాష్ట్రంలో హిందు మతంపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు రాజకీయాలు చెయ్యడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మరో వివాదం బయటకు వచ్చేలా ఉంది. అదేంటంటే తిరుమ‌ల శ్రీవారి విష‌యంలో స్వామికి భ‌క్తులు కానుక‌గా ఇచ్చిన వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్రభుత్వం రుణంగా తీసుకునేందుకు లేదా బ్యాంకుల ద్వారా శ్రీవారి నిధుల‌ను చూపించి.. ప‌రోక్షంగా రుణాలు పొందేందుకు జ‌గ‌న్ స‌ర్కారు పావులు క‌దుపుతున్న వ్యవ‌హారం మ‌రింత దుమారం రేగుతోంది. దీంతో ఈ విష‌యాలు కూడా రాజ‌కీయంగా ఇబ్బందిగా మారాయి. ఈ విషయంపై అన్ని పార్టీల నాయకులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం ఒకవేళ కార్యరూపం దాల్చితే వైసీపీ ప్రభుత్వం మరో మతపరమైన వివాదంలో చిక్కుకోనుంది.

ఇబ్బందుల్లో పడ్డ స్వామీ స్వరూపానంద

తిరుమ‌ల శ్రీవారి విష‌యంలో స్వామికి భ‌క్తులు కానుక‌లను రాష్ట్ర ఖజానాకు మళ్లించాలనే నిర్ణయం వల్ల స్వామి స్వరూపానంద కూడా ఇబ్బందుల్లో పడ్డారు. ప్రభుత్వం ఇలా దేవుడి నిధులతో ఆటలు ఆడాలనుకుంటుంటే స్వామీజీ ఎందుకు మౌనంగా ఉన్నారని హిందూ మత పెద్దలు ప్రశ్నలు సందిస్తున్నారు. ఎందుకంటే ఆయన జగన్ కు ఒకరకంగా గురువుగా ఉన్నారు. శిష్యుడు తప్పు చేస్తుంటే గురువు ఎందుకు అడ్డుకోవడం లేదని టీడీపీ నాయకులు ప్రశ్నలు సందిస్తున్నారు. జగన్ వ్యవహార శైలి వైసీపీ నాయకులతో పాటు స్వామీజీని కూడా ఇబ్బందుల్లో పడేసింది.