ఈ భారీ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ మెంటల్ మాస్ గా ఉంటుందట.!

ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మన ఇండియన్ సినిమా దగ్గర అయితే ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో క్రేజీ కాంబినేషన్ లలో ఒక బిగ్గెస్ట్ మరియు బెస్ట్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది ఇప్పుడు వస్తున్న “విక్రమ్” సినిమా అని చెప్పాలి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ తో చేసిన ఈ భారీ ఏక్షన్ డ్రామా లో కమల్ తో పాటుగా..

మరికొందరు విలక్షణమైన నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే వీరితో పాటుగా ఇంకో ఎగ్జైటింగ్ న్యూస్ అయితే హీరో సూర్య పై తిరుగుతూ వస్తుంది. సూర్య ఉన్నాడని ఎప్పుడైతే కన్ఫర్మ్ అయ్యిందో అక్కడ నుంచి భారీ హైప్ ఈ సినిమాపై నెలకొంది.

మరి ఈ హైప్ కి తగ్గట్టే సూర్య రోల్ కూడా మెంటల్ మాస్ గా ఉంటుందట. సూర్య పాత్ర ఇంట్రడక్షన్ నుంచే ఈ సినిమా ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిపోతుందట. ఈ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మరి సూర్య క్యామియో ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే జస్ట్ మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇంకా ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ అయితే ఎవరు లేనట్లే అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. కమల్ హాసన్ తన రాజ్ కమల్ సినిమాస్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.