Suriya: సినిమా ఇంకా మొదలుకాకముందే కళ్ళు చెదిరే ధరకు ఓటీటీ డీల్.. ఫ్లాపులు వచ్చినా సూర్య క్రేజ్ తగ్గడం లేదుగా!

Suriya: కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. గత నెల అనగా మే నెలలో ఒకటవ తేదీన విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. తమిళంలో బాగానే ఆడిన ఈ సినిమా తెలుగు తో పాటు మిగతా భాషల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్ట లేకపోయింది. అంతకుముందు సూర్య నటించిన కంగువా సినిమా పరిస్థితి కూడా ఇదే అని చెప్పాలి. అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్న సూర్య స్పీడ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.

రెట్రో షూటింగ్ పూర్తి కాకముందే, నటుడు సూర్య తన 45వ చిత్రం కోసం దర్శకుడు, నటుడు RJ బాలాజీతో జతకట్టాడు. ఈ చిత్రంలో నటి త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడిన నిర్మాత, షూటింగ్ త్వరలో పూర్తవుతుందని, సినిమా ఖచ్చితంగా పండుగ రోజున విడుదల అవుతుందని అన్నారు. దీపావళికి విడుదల అవుతుందా అని విలేకరులు అడిగినప్పుడు, ఆయన నవ్వుతూ, పండుగ రోజున ఉంటుందని అన్నారు.

రెట్రో సినిమా థియేటర్లలో ఉండగానే సూర్య వెంకీ అట్లూరితో జతకట్టాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నటుడు సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరితో పాటు నటి మమిత బైజు, సంగీత స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ సైతం పాల్గొన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ గతంలో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్ లక్కీ భాస్కర్ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను దాదాపు 85 కోట్లకు చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.