ఇదిరా సుఖం అంటే.. చిల్ టైం అంటోన్న సురేఖా వాణి

నటి సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సురేఖా వాణి తన కూతురు సుప్రితను సైతం ఇప్పుడు పాపులర్ చేసేసింది. టిక్ టాక్ ఊపు నడుస్తున్న సమయంలో ఈ తల్లీ కూతుళ్లు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీరి డ్యాన్స్ వీడియోలు మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టేవి. అలా ఈ ఇద్దరూ వేసిన స్టెప్పులతోనే ఇంతగాఫేమస్ అయ్యారు. తన కూతురు సుప్రితను ఇలా సోషల్ మీడియా సెన్సేషన్‌గా తయారు చేయడంలో సురేఖా వాణి సక్సెస్ అయింది.

Artist Surekha Vani about Her Chill Time
Artist Surekha Vani about Her Chill Time

ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తారు. వెకేషన్స్‌కు వెళ్లినా పార్టీలకు వెళ్లినా పబ్‌లకు వెళ్లినా కూడా కలిసి వెళ్తుంటారు. తల్లీ కూతుళ్లలా కాకుండా ఫ్రెండ్స్‌ల ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఈ ఇద్దరూ చేసే రచ్చకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఆ మధ్యగోవా బీచ్‌లో మందు గ్లాసును చేతిలో పట్టుకుని అలా కూతురితో నడిచి వస్తోన్న ఫోటోను షేర్ చేయడంతో అందరి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అలా సురేఖా వాణి అప్పుడప్పుడు సోషల్ మీడియాకు అలాంటి ఝలక్‌లు ఇస్తూ ఉంటుంది.

ఇక వీకెండ్‌లు వస్తే కూతురితో కలిసి ఏదో ఒక పార్టీ, పబ్‌లోకి వెళ్తుంది. కూతురి కంటే ఎక్కువగా సురేఖా వాణియే హడావిడి చేస్తుంటుంది. సుప్రిత కంటే ఎక్కువగా సురేఖా వాణిని చూసే అందరూ ఫిదా అవుతుంటారు. తాజాగా సురేఖా వాణి ఓ ఫోటోను షేర్ చేసింది. చిల్ టైం అంటూ కూతురితో కలిసి అలా టీవీలో సినిమా చూస్తూ రిలాక్స్ అవుతోంది. ఇది కదరా సుఖమంటే అనే రీతిలో సురేఖా వాణి రచ్చ చేస్తుంది. ప్రస్తుతం సురేఖా వాణి చేతిలో పలు ప్రాజెక్ట్‌లున్నాయి. కూతురికి కూడా పలు ప్రకటనల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయి.