స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంచాలని చాలాకాలంగా డిమాండ్ వ్యక్తం అవుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై రకరకాల కమిటీల, సర్వేలు జరిగాయి. అయినా అంతిమంగా సుంప్రీ కోర్టు తీర్పే తుదిగా పాటించాల్సిన సన్నివేశం. తాజాగా మరోసారి సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై కుండ బద్దలు కొట్టిచెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో 50 శాతానికి రిజర్వేషన్లు మించకూడదని కోర్టు మరోసారి వెల్లడించింది. తెదాపా ఎంపీ రామ్మోహన్ నాయడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాసులు సహా పలువురు నేతలు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య దర్మాసనం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యపడదని తీర్పునిచ్చింది. 2010 లో కె. ఈ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని మరోసారి సుప్రీం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపినా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పు వెలువరించింది. మరోసారి ఈ తీర్పునే అరుణ్ మిశ్రా ధర్మాసనం పాటించింది. ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలకు నగరా మోగడానికి సన్నధం అవుతోన్న నేపథ్యంలో టీడీపీ తమ్ముళ్లకు సుప్రీం తాజా తీర్పుతో గట్టి షాక్ తగిలిందనే అనాలి.
కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని టీడీపీ చేసే విశ్వ ప్రయత్నాల్లో భాగంగా రిజర్వేషన్లపై కొట్టేయాలని ప్లాన్ చేసింది. చంద్రబాబు నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవాన్ని అంతా దారబోసి ఇలా రిజర్వేషన్లు తీసుకొచ్చి తమ ఓటు బ్యాంక్ ను సుస్థిరం చేసుకోవాలని చూసారు. కానీ సుప్రీం తీర్పు రూపంలో బాబు అండ్ కోకి ఊహించని షాక్ తగిలింది. ఈ తీర్పు అధికార పక్షానికి కలిసొచ్చే అంశమే. గత ఎన్నికల్లో టీడీపీ హస్తగతం చేసుకున్న 23 స్థానాలకు రిజర్వేషన్లే పెద్ద పీట వేసాయి. లేదంటే బాబు అండ్ కో అక్కడా చతికలిపడేది. ఇప్పటికే ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే.