తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన స్టైల్, మ్యానరిజం వల్ల రజనీకాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరిగింది. కండక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రజనీకాంత్ ప్రస్తుతం సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఏడు పదుల వయస్సులో కూడా యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు రజినీకాంత్ గట్టి పోటీ ఇస్తున్నారు.
సినిమాల ద్వారా ఎక్కువ మొత్తంలో సంపాదించిన హీరోలలో రజినీకాంత్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ మొత్తం ఆస్తుల విలువ 360 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. కమర్షియల్ యాడ్స్ కు రజనీకాంత్ దూరంగా ఉండటం వల్ల ఆయన సంపాదన తక్కువగా ఉందని ఒకవేళ కమర్షియల్ యాడ్స్ లో నటించి ఉంటే మాత్రం ఆయన సంపాదన కళ్లు చెదిరే స్థాయిలో ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు రజినీకాంత్ 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇతర భాషల్లో కూడా రజినీకాంత్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అపూర్వ రాగంగళ్ అనే సినిమాతో నటుడిగా రజనీకాంత్ ప్రయాణం మొదలైంది. రజినీకాంత్ గత సినిమా పెద్దన్న బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
రజినీకాంత్ ను అమితంగా అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. రజినీకాంత్ తర్వాత సినిమాలతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రజినీకాంత్ ఆరోగ్య సమస్యలు ఉన్నా సినిమాలకు మాత్రం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాసినిమాకు రజినీకాంత్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం