డిజాస్టర్ పడినా నితిన్ క్రేజ్ తగ్గలేదు

Super pre release business for Nithiin's Rang De

Super pre release business for Nithiin's Rang De

‘భీష్మ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న యూత్ హీరో నితిన్ ఎన్నో ఆశలతో చేసిన సినిమా ‘చెక్’. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టలపాలయ్యారు. ఈ దెబ్బతో నితిన్ మార్కెట్ క్రాష్ అవుతుందని అంతా అనుకున్నారు. అలాంటి డిజాస్టర్ తర్వాత ఏ హీరోకైనా మార్కెట్ తగ్గడం మామూలే. కానీ నితిన్ విషయంలో అలా జరగలేదు. అంతటి ఫ్లాప్ ఎదురైనా బిజినెస్ వర్గాల్లో అతని క్రేజ్ అలాగే ఉంది.

అందుకు నిదర్శనమే ఆయన తాజా చిత్రం ‘రంగ్ దే’ ప్రీ రిలీజ్ బిజినెస్. నైజాం ఏరియాలో 7.6 కోట్లకు అమ్ముడైన ఈ సినిమా హక్కులు ఆంధ్రాలో 10 కోట్లకు, సీడెడ్లో 3.6 కోట్లకు, ఓవర్సీస్లో 1.5 కోట్లకు అమ్ముడై మొత్తం 23.9 కోట్ల బిజినెస్ చేశాయి. ఇక శాటిలైట్, డిజిటల్ బిజినెస్ ఎలాగూ ఉంటుంది. ఒక భారీ ఫ్లాప్ తర్వాత ఇలాంటి బిజినెస్ చేయడమంటే విశేషమే. ‘రంగ్ దే’ ట్రైలర్ ఆకట్టుకోవడం మూలానే ఈ బిజినెస్ జరిగిందని అంటున్నారు. మరి మార్చి 26న విడుదలకానున్న ఈ సినిమాతో అయినా నితిన్ సాలిడ్ హిట్ అందుకుంటారేమో చూడాలి.