Sunny leone : ఆ తేడాల్లేవంటోన్న సన్నీలియోన్ ఏంటో తెలుసా.?

Sunny leone : సవతి పిల్లల్ని కాస్త తక్కువ చేసి చూడడం అనేది చాలా సినిమాల్లో చూశాం. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ సహజంగా చూస్తుంటాం. కానీ, బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ సన్నీలియోన్‌కి మాత్రం ఆ తేడాల్లేవంటోంది.

సన్నీలియోన్ దంపతులు ఓ అమ్మాయిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసీ విధానం ద్వారా ఇద్దరు మగపిల్లలకు (ట్విన్స్) తల్లిదండ్రులయ్యారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

ముగ్గురు పిల్లల్ని సన్నీలియోన్ ఎలా మ్యానేజ్ చేస్తున్నట్లు.? ముందుగా దత్తత తీసుకున్న ఆడపిల్ల విషయంలో సన్నీలియోన్ ఏమైనా పక్షపాతం చూపిస్తోందా.? అంటే అలాంటి పక్షపాతాలేం తనకు లేవంటోంది సన్నీలియోన్.

ముగ్గురు పిల్లలూ తనకు సమానమే. ఎవర్నీ ఎక్కువ చేయను.? ఎవర్నీ తక్కువ చేయనుంటోంది. పోర్న్ స్టార్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఐటెం భామగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీలియోన్, అతి తక్కువ సమయంలోనే తిరుగు లేని ఫేమ్ సంపాదించింది.

హీరోయిన్‌గా సక్సెస్ అయ్యింది. నెట్టింట విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే ఇటు సౌత్ సినిమాల పైనా తన వంతు ఫోకస్ పెట్టింది. కొన్ని సౌత్ సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నర్తించింది.

రీల్‌ పరంగా ఇంత ఫేమ్ వున్న సన్నీలియోన్, రియల్ లైఫ్‌లోనూ ముగ్గురు పిల్లలకు తల్లిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అందుకే సన్నీలియోన్ సమ్‌థింగ్ స్పెషల్ అంతే.