Actor Suman: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై నటుడు సుమన్ పొగడ్తల వర్షం కురిపించారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ 151 స్థానాలలో అద్భుతమైన విజయాన్ని సాధించింది అయితే ఎలాంటి పొత్తూ లేకుండా సింగిల్ గా పోటీ చేస్తూ ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేశారు.
ఈ క్రమంలోనే 2024 ఎన్నికలలో కూడా వైసిపి భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కానీ ఊహించని విధంగా వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. మరోవైపు కూటమి పార్టీలు అయినటువంటి బిజెపి తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలు అద్భుతమైన మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
ఇలా జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇదిలా ఉండగా తాజాగా జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలు కావడం గురించి యాక్టర్ సుమన్ ఓ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదని పెద్ద టఫ్ ఫైట్ చేశారు అంటూ తెలిపారు.
ఒకవైపు జగన్, మరోవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ కలిసి పోటీ చేశారు. వారితో కలిసి జగన్ టఫ్ ఫైట్ చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కూల్స్ ఎంతో అభివృద్ధి చెందాయి అలాగే ఆయన ఎక్కువగా విద్య వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేశారు. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అద్భుతంగా అమలు చేశారు ఇక కరోనా సమయంలో చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి యాక్టర్ సుమన్ ప్రశంసలు కురిపిస్తూ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.