సీనియర్ నటులు  సుమన్,ఆమని లు విడుదల చేసిన “మది” ట్రైలర్ 

ఆర్. వి రెడ్డి సమర్పణలో  ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో రామ్ కిషన్  నిర్మిస్తున్న సినిమా “మది”. ఆర్వి సినిమాస్ సహనిర్మాతలుగా వ్యవహారిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులని అలరించ బోతుంది.పివిఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కకార్యక్రమాలు  పూర్తి చేసుకుని  సెన్సార్  జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా జరుపుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధితులుగా వచ్చిన సీనియర్ నటుడు సుమన్, నటి ఆమని లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి మండలి శాశన సభ్యులు దయానంద్ గుప్త, కిరణ్, బి. సి. కమీషన్ ఉపేంద్ర, ఫుడ్ కమిషన్ గోవర్ధన్ రెడ్డి, నటి నవీన రెడ్డి, దర్శకుడు జై శంకర్ తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
గెస్ట్ గా వచ్చిన  సుమన్ గారు మాట్లాడుతూ.. మంచి యూత్ ఫుల్ సబ్జెక్ట్ తో వస్తున్న “మది” సినిమా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. దర్శకుడు నాగధనుష్, నిర్మాత రామ్ కిషన్ లిద్దరూ చక్కటి కథను సెలక్ట్ చేసుకొని  నేటి యూత్ కు నచ్చేవిధంగా చాలా బాగా తెరకెక్కించారు.ఇందులో హీరో, హీరోయిన్ లు నటన చేస్తుంటే  మన పక్కింటి అబ్బాయి, అమ్మాయిలా చాలా బాగా నటించారు. వీరు పడిన కష్టానికి కచ్చితంగా ప్రతి ఫలం లభిస్తుందని  ఆశిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
గెస్ట్ గా వచ్చిన  ఆమని మాట్లాడుతూ.. “మది” ని దోచేలా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్  సబ్జెక్టు ను దర్శక, నిర్మాతరిద్దరూ చాలాబాగా తెరకెక్కించారు.వీరికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న “మది” చిత్రం బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు .
గెస్ట్ గా వచ్చిన మండలి శాశన సభ్యులు దయానంద్ గుప్త మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది మంచి కథతో వస్తున్న ఈ చిత్రం బిగ్ హిట్ అయి చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద  బెస్ట్ తెలిపారు.
చిత్ర దర్శకుడు నాగ ధనుష్ మాట్లాడుతూ..మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. 2020 లో ఈ సినిమా స్టార్ట్ చేశాము. కథ రాసుకునే క్రమంలో  ఈ కథ  ప్రేమ పరిధిలు దాటి, ఏమోషన్స్ దాటి ముందుకు వెళ్లడంతో ఈ సినిమాకు “మది” టైటిల్ కరెక్ట్ అని బావించి “మది” టైటిల్ పెట్టాము ..రొమాంటిక్ లవ్ స్టొరీ గా రాబోతున్న ఈ చిత్రం ఈ తరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేల ఉంటూ, వినూత్నరీతిలో ఈ కథ సాగుతుంది.ఈ సినిమా స్టార్ట్ చేసిన  తరువాత కరోనా రావడం ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. సినిమా రిలీజ్ టైమ్ లో ఆర్ వి రెడ్డి గారు మాకు సపోర్ట్ గా రావడం చాలా సంతోషంగా ఉంది. హీరో హీరోయిన్ లు మాకు సపోర్ట్ చేస్తూ చాలా బాగా నటించారు. సంగీత దర్శకుడు  ఈ సినిమాకు ప్రాణం పోశాడు. కెమెరామెన్ విజయ్ ఠాగూర్, ఎడిటర్, ఇలా టెక్నిషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇలా సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదములు అన్నారు.
నిర్మాత రామ్ కిషన్ మాట్లాడుతూ.. మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.  డైరెక్టర్ తో షార్ట్  ఫిల్మ్ తో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. మంచి కంటెంట్ ను తయారు చేసుకొని ఈ సినిమా తీశాము. ఆర్టిస్ట్ గా అవుతామను వచ్చిన నేను నా ఫ్రెండ్ బాధ చూడలేక నిర్మాతగా మారడం మారడం జరిగింది. అలాగే మాకు సపోర్ట్  గా నిలిచిన ఆర్. వి రెడ్డి గారికి ధన్యవాదములు. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంది. కథ-సందర్భానుసారంగా ఈ సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి, రఘు కుంచె, సునీత, రమ్య బెహార, దీపు, సాయి చరణ్, హరిణి ఆలపించడం జరిగింది. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను  అలరించనుందని కచ్చితంగా చెప్పగలను అన్నారు.
కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..  ప్రస్తుత యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేటటువంటి అద్భుతమైన కథను దర్శకుడు నాగ ధనుష్ చాలా ఎఫర్ట్ పెట్టి  తెరకెక్కించాడు. ఇలాంటి మంచి కథను సెలెక్ట్ చేసుకుని నిర్మించిన రామ్ కిషన్ కు ఆర్. వి రెడ్డి గారు పరిచయమవ్వడం వారు రామ్ కిషన్ ను పరిచయం చేయడంతో  మేము ఈ సినిమా చూశాము చాలా బాగుంది. అందుకే వీరికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాము. మ్యూజిక్ బాగుంది ఇందులో ఉన్న ఐదు సాంగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. నటీ నటులు  చాలా బాగా నటించారు. హీరో శ్రీరామ్ ను చూస్తుంటే జూనియర్ నాగసౌర్యలా ఉన్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ..  2017 నుండి పరిచయం ,2019లో నాకు ఈ కథ చెప్పారు. కథ విన్న తరువాత  ఇది  వెరీ లవ్ లీ ఎమోషన్ కథ అనిపించడమే  కాకుండా ఈ కథ నాకు బాగా నచ్చింది. ఈ కథ మీద ఉన్న నమ్మకంతో రామ్ కిషన్ గారు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమా కథకు, సినిమాటోగ్రఫీ కి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో..మ్యూజిక్ కు అంతే  ఇంపార్టెంట్ ఉంటుంది.పాటలు అద్భుతంగా వచ్చాయి.ఆర్. వి రెడ్డి ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ప్రస్తుత యువత  మనస్తత్వం ఏంటి వారి మనసులో ఏముంటుంది అనేదే ఈ కథ.  అభి పాత్రలో నటిస్తున్నాను. మొత్తంగా  చెప్పాలి అంటే అభి గాడి జర్నీయే మది సినిమా. సముద్రమంత ప్రేమను చూడాలి అంటే మది సినిమా చూస్తే మీకే  తెలుస్తుంది. ఇందులో అభి గాడు  ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, ఎంటర్ టైన్ చేస్తాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర హీరోయిన్ రీచా జోషి మాట్లాడుతూ.. అందరూ ట్రైలర్ చాలా బాగుంది అంటుంటే  మది సినిమా ఎప్పుడ విడుదల అవుతుందా  అని చాలా ఎగ్జాయిటింగ్ గా ఉంది టీం అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.. ఈ సినిమా చాలా  రియాలిస్టిక్ గా ఉంటుంది.చూసిన వారికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి. సి. కమీషన్ ఉపేంద్ర, ఫుడ్ కమిషన్ గోవర్ధన్ రెడ్డి, నటి నవీన రెడ్డి, దర్శకుడు జై శంకర్,కిరణ్ తదితరులందరూ ట్రైలర్ చాలా బాగుంది త్వరలో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
నటీనటులు:
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి, రామ్ కిషన్, శ్రీకాంత్ బైరోజ్, స్నేహ మాధురి శర్మ, యోగి కత్రి, శ్రీనివాస్  తదితరులు..
సాంకేతిక నిపుణులు:

నిర్మాతలు: రామ్ కిషన్

సహా నిర్మాత: శ్రీనివాస్ రామిరెడ్డి

కథ-కథనం-మాటలు-దర్శకత్వం: నాగ ధనుష్

కెమెరామెన్: విజయ్ ఠాగూర్

మ్యూజిక్: పివిఆర్.రాజా

ఆర్ట్: విజయ్

ఎడిటర్: ప్రదీప్. జంబిగ

లిరిక్స్: కడలి, పూర్ణ చారి