Home News యాంక‌ర్ సుమ తుంట‌రి ప‌నులు.. నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్

యాంక‌ర్ సుమ తుంట‌రి ప‌నులు.. నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్

టాలీవుడ్ హీరోయిన్స్‌తో స‌మానంగా క్రేజ్ పొందిన ఫేమ‌స్ యాంక‌ర్ సుమ‌. కొన్ని ద‌శాబ్దాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తుంది. మ‌ల‌యాళీ అయిన‌ప్ప‌టికీ తెలుగు చ‌క్క‌గా మాట్లాడుతుంది. పంచ్‌ల‌కు పంచులు, కామెడీలు, సెటైర్స్ ఇలా త‌న మాట‌ల గార‌డీతో అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సెట్స్‌లో జ‌రిగిన ప‌లు ఆస‌క్తిర విష‌యాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫ‌న్నీ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, ఇది నెటిజ‌న్స్‌కు న‌వ్వు తెప్పిస్తుంది.

Sumaa | Telugu Rajyam

ఏదో షూటింగ్ సెట్‌లో ఫ్లోర్‌పై ప‌డిన కొన్ని వ‌స్తువుల‌ను త‌న లంగాని గిర‌గిర తిప్పుతూ ఊడ్చేస్తుంది. ఫ్లోర్ ను ఎలా క్లీన్ చేయాలనే దాని కోసం నేను కొత్త ప‌ద్ద‌తి క‌నుగొన్నాను. మా సెట్‌లో ప‌నివాళ్ళు ఉన్న‌ప్ప‌టికీ, వారి క‌న్నా వేగంగా ఫ్లోర్ ఊడ్చేస్తున్నాను అంటూ సుమ త‌న పోస్ట్‌కు కామెంట్ పెట్టింది. ఈ వీడియోని చూసి నెటిజ‌న్స్ ముసిముసి న‌వ్వులు న‌వ్వుకుంటున్నారు. ఎప్పుడు టీవీ షోస్ లేదంటే ఆడియో ఫంక్ష‌న్స్‌తో బిజీబిజీగా ఉండే సుమ క‌న‌కాల ఈ మ‌ధ్య కాస్త స‌మ‌యాన్ని సోష‌ల్ మీడియాకు కేటాయిస్తుంది.

లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ కావ‌డంతో సుమ కంప్లీట్‌గా సోష‌ల్ మీడియాతోనే టైం పాస్ చేసింది. ఇంట్లోని సంగ‌తుల‌న్నింటిని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కు మంచి వినోదాన్ని అందించింది. ప్ర‌స్తుతం షోస్ మ‌ళ్ళీ మొద‌లు కావ‌డంతో ఇక త‌న హవా చూపిస్తుంది. బుల్లితెర‌పై ఎంత మంది యాంక‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ సుమ‌కు ఉన్న క్రేజ్ వేరు. ల‌క్ష‌లు ఇచ్చి మ‌రీ ఆమెతో షోస్ చేయిస్తున్నారంటే సుమ‌పై నిర్వాహ‌కుల‌కు ఎంత న‌మ్మ‌క‌మో అర్ద‌మ‌వుతుంది. తెలుగులో ఏదైనా పెద్ద సినిమా ఈవెంట్ ఏదైనా ఉంటే.. అక్కడ సుమ మాటల గారడీ ఉండాల్సిందే. అందుకే ఆమెను ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా తీసుకుంటారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suma K (@kanakalasuma)

 

 

- Advertisement -

Related Posts

దేవినేని అవినాష్‌కు పెద్ద బాధ్యతే అప్పజెప్పిన సీఎం జగన్… నిరూపించుకుంటే ఇక దశ మారినట్టే ?

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరగబోతున్న తొలి ఎన్నికలు కావడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ...

సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ “భీష్మ” డైరెక్టర్ !

టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతూ పోతోందో అంతే వేగంగా సైబర్ నేరగాళ్ల అక్రమాలూ పెరిగిపోతున్నాయి. సామాన్యులనే కాకుండా, ఈ సైబర్ నేరగాళ్లు ప్రముఖుల్ని వదలడం లేదు. తాజాగా నితిన్‌, రష్మిక మందానా జంటగా...

‘దృశ్యం 2’ షూటింగ్ మొదలెట్టిన వెంకటేశ్ !

గతంలో వచ్చిన 'దృశ్యం' సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఓ హత్య విషయంలో హీరో ఇంటిల్లిపాదీ ఒకే మాటపై నిలబడడం.. పోలీసులు ఎంతగా విచారణ చేసినా నిజం కక్కకపోవడం.. అదంతా ఓ కొత్త...

Latest News