కొంత మంది దర్శకులు, సంగీత దర్శకులకి విడదీయలేని బంధం ఉంటుంది. ఒకప్పుడు ఇళయరాజా తో సినిమాలు చేసిన మణిరత్నం ఆ తర్వాత అతని దాదాపు అన్ని సినిమాలకు రెహమాన్ మాత్రమే మ్యూజిక్ అందించాడు. టాలీవుడ్ లో చాన్నాళ్లు పూరి జగన్నాధ్, కాంబినేషన్ నటిచింది. అలాగే కొరటాల శివ మొదటి నాలుగు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. తన లేటెస్ట్ మూవీ కి మాత్రం మణిశర్మ సంగీతం అందించాడు.
మొదటినుండి దేవి శ్రీ ప్రసాద్ తో తప్ప ఏ ఇతర మ్యూజిక్ డైరెక్టర్ జోలికి పోలేదు సుకుమార్. నేను శరీరం అయితే.. దేవీ నా ఆత్మ` అని సుకుమార్ చాలా సందర్భాల్లో చెప్పాడు. వాళ్ల బంధం అలాంటిది. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక మీదటా చేయడు కూడా. `సుకుమార్ రైటింగ్స్`పై సుకుమార్ చిన్న సినిమాలు తీసినప్పుడు కూడా దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నాడు.
కానీ మొదటిసారి దేవి ని కాదని `కాంతార` సంగీత దర్శకుడు అంజనీష్ లోక్‌నాథ్‌ని సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు తీసుకున్నాడంట. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే సుకుమార్ అందిస్తున్నాడు. నిజానికి ఈ సినిమాకు దేవి ని ముందు అడిగారట….ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ దేవి అడిగిన నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాడు. కానీ బడ్జెట్ పెంచడం ఇష్టం లేక సుకుమార్ దేవి ని కాదని అంజనీష్ లోక్‌నాథ్‌ని ఫైనల్ చేసాడంట.