Suicide: విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా కాలంలో లాక్ డౌన్ వల్ల పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మందికి పూట గడవటం కూడా కష్టంగా మారింది. కరోనా వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయి అప్పు చేసి ఏదో ఒక వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోసించుకుందామని అనుకునే వారికి కూడా వ్యాపారాలు జరగక నష్టాలు చూస్తున్నారు. ఇలాంటి ఒక విషాదకర సంఘటన విశాఖపట్నం జిల్లా, రైల్వే న్యూ కాలనీలో చోటు చేసుకుంది.
అక్కయ్యపాలెం లో గ్లాస్ వరల్డ్ అద్దాల షాప్ నడిపిస్తున్న వ్యక్తి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారం నిమిత్తం ఇతరుల దగ్గర అధిక మొత్తంలో అప్పులు చేశారు. చేసిన అప్పులు, వాటి వడ్డీలు రోజురోజుకీ పెరుగుతుండటంతో మనస్థాపానికి గురయ్యారు. అప్పులు తీర్చలేక,సమాజంలో పరువు పోయి తీవ్ర మనస్థాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అప్పుచేసి వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోషించాలని అనుకున్నాడు. కానీ వ్యాపారంలో నష్టాలే మిగిలాయి. అప్పు ఇచ్చిన వారు వత్తిడి చేస్తారనే భయంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ప్రతిరోజు ఎంతోమంది అప్పుల బాధ భరించలేక, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.