సాధారణంగా మనం మనకు అధిక పని ఒత్తిడి కలిగినప్పుడు లేదా ఇతరతా కారణాల వల్ల ఎక్కువగా తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మన పొట్టలో ఏర్పడిన గ్యాస్ సమస్య వల్ల కూడా విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఇలా వచ్చే తలనొప్పి చాలా మందిని ఎంతగానో బాధిస్తుంది. అయితే ఈ విధమైనటువంటి తలనొప్పితో బాధపడేవారు తొందరగా తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు. మరి ఆ చిట్కాలు ఏంటో ఓ లుక్కేద్దాం…
నిమ్మరసం: నిమ్మరసంలో విటమిన్ సి తో పాటు ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కనుక నిమ్మరసం తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో దోహదపడుతుంది కేవలం గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగటం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
పలుచటి మజ్జిగ: గ్యాస్టిక్ సమస్య వల్ల తలనొప్పితో బాధపడేవారు పలుచటి మజ్జిగను తాగటం వల్ల ఉపశమనం పొందవచ్చు.ఒక గంట వ్యవధిలో రెండు సార్లు మజ్జిగ తాగటం వల్ల తొందరగా ఉపశమనం కలుగుతుంది.
హైడ్రేటెడ్ గా ఉండడం: మన శరీరానికి నీరు ఎంతో అవసరం ఎప్పుడైతే మన శరీరం డిహైడ్రేట్ అయ్యి నీటి శాతాన్ని కోల్పోతుందో ఆ సమయంలో మనలో జరిగే జీవక్రియలు సక్రమంగా జరగక తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే వీలైనంత వరకు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచాలి. అంటే ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవడం లేదా నీటి శాతం అధికంగా కలిగిన పండ్లు తీసుకోవడం ఎంతో మంచిది అలాగే తరచూ పండ్ల రసాలు తీసుకోవడం వల్ల మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.