సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో కనపడకపోవడం పై స్పందించిన అవినాష్.. ఏమన్నారంటే?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయిన సుడిగాలి సుదీర్ గత కొన్ని వారాల నుంచి ఈ కార్యక్రమంలో కనబడలేదు.ఇక ఈయన కనిపించకపోవడంతో హైపర్ ఆది బాటలోనే సుడిగాలి సుదీర్ కూడా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారా అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయం గురించి సుదీర్ ఎక్కడ ప్రస్తావించకపోయినా ఈయన మాత్రం ఈటీవీలో ప్రసారమవుతున్న మల్లెమాల వారి కార్యక్రమాలను పూర్తిగా తప్పుకొని స్టార్ మాలో యాంకర్ గా బాధ్యతలు చేపట్టారు. దీంతో సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమాన్ని విడిపోయారని అందరికీ అర్థమవుతుంది.

ఇకపోతే సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించకపోవడంతో ఈ విషయంపై ముక్కు అవినాష్ స్పందించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ముక్కు అవినాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ టీమ్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోని ఈ టీమ్ నుంచి ముందుగా గెటప్ శీను బయటకు వెళ్లారు.గెటప్ శీనుకు ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు రావడంతో ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్టు ముక్కు అవినాష్ వెల్లడించారు.

గెటప్ శ్రీను వెళ్లిపోయిన కొన్ని వారాలకు సుడిగాలి సుదీర్ కూడా కనిపించకపోవడంతో ఈయన కూడా సినిమాలతో బిజీగా ఉండటం వల్లే జబర్దస్త్ కార్యక్రమంలో నటించలేదని అందరూ భావించారు. అయితే ఈయన ఈ టీవీ కి దూరం అయ్యి మా టీవీ కి దగ్గర కావడంతో ఆయన గురించి పలు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే అవినాష్ ఈ విషయంపై స్పందిస్తూ సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో విడిపోననీ గతంలో ఎన్నోసార్లు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి సరైన కారణం తనకు తెలియదని అయితే సినిమా అవకాశాలు రావడం వల్లే సుధీర్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది అంటూ అవినాష్ తెలిపారు.